సచిన్ టెండూల్కర్ దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే టీమిండియా క్రికెట్లో సేవలు అందించాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లతో ఎన్నో అరుదైన భాగస్వామ్యాలు నిర్మించాడు అన్న విషయం తెలిసిందే. అయితే సచిన్ తన కెరియర్ లో సౌరబ్ గంగూలీ తర్వాత ఎక్కువగా భాగస్వామ్యం నిర్మించింది అటు వీరేంద్ర సెహ్వాగ్ తోనే అని చెప్పాలి. ఏకంగా వన్డే ఫార్మాట్లో 114 మ్యాచుల్లో వీరిద్దరి జోడి 4387 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అయితే భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజాలను దాటుకుని టెస్ట్ ఫార్మాట్లో త్రిబుల్ సెంచరీ  చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్.



 2004 సంవత్సరంలో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ ఆ మ్యాచ్ సమయంలో సచిన్ టెండూల్కర్ తో జరిగిన ఫన్నీ సంఘటనలను బయటపెట్టాడు. మొదట్లో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని.. అందుకే నా దృష్టి మొత్తం బౌండరీలు కొట్టడం పైనే ఉండేది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఇదే శైలిని ఫాలో అయ్యా.. సింగిల్స్ డబుల్స్ తీయాలంటే నాకు పెద్ద చిరాకు.



 అయితే నాకు రెండు సంఘటనలు బాగా గుర్తున్నాయ్. 2003 మెల్ బోర్న్  టెస్టులో సిమన్ కటీచ్ బౌలింగ్లో వరుసగా సిక్సర్లు బాదాను. అప్పటికి నా స్కోర్ 195 ఇంకో సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేయాలనుకున్న.. కానీ క్యాచ్ ఇచ్చి అవుటయ్య. అప్పుడు భారత్ ఓడిపోయింది. తర్వాత ముల్తాన్ టెస్టులో నేను సెంచరీ చేరుకోవడానికి  6 నుంచి 7 సిక్సర్లు   కొట్టా. తర్వాత సచిన్ టెండూల్కర్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంకోసారి కొట్టావంటే నేనునా బ్యాట్ తో కొడతా అంటూ  అన్నాడు. దీంతో షాక్ అయ్యా.  ఎందుకు అని అడిగా.. నువ్వు ఆస్ట్రేలియా తో టెస్టులో ఇలాగే సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి.. అవుట్ అయ్యావు. ఆరోజు మ్యాచ్ ఓడిపోయాం అని చెప్పడంతో.. అతని మాట విని 120 నుంచి 195 పరుగుల వరకు వచ్చిన తర్వాత ఒక సిక్స్ కూడా కొట్టలేదు. అప్పుడు మళ్ళీ సిక్సర్ కొడతానని సచిన్ ను అడిగితే నువ్వు పిచ్చోడివా ఇప్పటిదాకా ఎవరూ త్రిబుల్ సెంచరీ చేయలేదు. నీకు అవకాశం వచ్చింది. పిచ్చి పనులు చేసి అవుట్ అవ్వకు హెచ్చరించడంతో మళ్లీ సిక్స్ కొట్టకుండానే త్రిబుల్ సెంచరీ పూర్తి చేశాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: