
కానీ ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఉన్న ధోని రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం తప్పనిసరి. ఈ క్రమంలోనే ధోని తర్వాత చెన్నై జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే గతంలో ధోని వారసుడు అంటూ జడేజా కు సారథ్యం అప్పగించింది చెన్నై జట్టు యాజమాన్యం. అయితే అతను కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. ఛాంపియన్ టీం కి వరస పరాజయాలతో ఘోర పరిస్థితి ఎదురయింది. అయితే కెప్టెన్ గానే కాదు ఆటగాడిగా కూడా జడేజా విఫలం కావడంతో మళ్ళీ కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు.
అయితే ఇక ఇప్పుడు 2023 ఏడాది ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనే విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జడేజాను కెప్టెన్గా చెన్నై ట్రై చేసింది. కానీ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరూ చూశారు. అయితే ప్రస్తుతం నాకు తెలిసి ధోని తర్వాత కెప్టెన్గా రహానే కంటే మెరుగైన ఆప్షన్ లేదు. అతను మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక భారత ఆటగాడు కూడా. ఫ్రాంచైజీ క్రికెట్లో లోకల్ క్రికెటర్లు కెప్టెన్ గా రాణించడం చూస్తూనే ఉన్నాం. ధోని గనక కెప్టెన్సీ వదిలేయాలనుకుంటే అతని వారసుడిగా రహానే మాత్రమే సరైనోడు అంటూ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో రహానే భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎన్నోసార్లు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి అనే విషయం తెలిసిందే.