
అయితే ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుంది. కానీ అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయం లో ఇక ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాకులు అందరినీ బెంబేలేత్తిస్తున్నాయి అని చెప్పాలి ఎందుకు సడన్ హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి.. ఎలా ప్రాణాలను తీసేస్తున్నాయి అన్నది కూడా ఎవరికి అర్థం కాని విధంగానే మారి పోయింది. అప్పటివరకు ఎంతో సంతోషం గా ఆరోగ్యం గా ఉన్నవారు.. కేవలం నిమిషాల వ్యవధి లోనే కుప్ప కూలి పోయి కళ్ళముందే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది.
ఇక ఇటీవల గాంధీ ఆసుపత్రి లో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగు లోకి వచ్చింది. సాధారణం గా డాక్టర్ అంటే తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు ఆరోగ్యం గురించి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. అలాంటిది డాక్టర్ ఆరోగ్యం విషయం లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి డాక్టర్ ఇటీవల సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి లో పీడియాట్రిక్ సర్జన్ ఫణీంద్ర రోజు లాగానే విధులకు హాజరయ్యాడు. ఉదయం పేషెంట్లను పరీక్షిస్తున్న సమయం లో ఒక్కసారిగా కుప్పు కూలి పోయాడు. అప్రమత్తమైన ఇతర వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు.