ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తి సాయి షెడ్యూల్ ని కూడా అధికారికంగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఇక ఐసిసి టోర్నీ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే 8 జట్లు నేరుగా వరల్డ్ కప్ కోసం అర్హత సాధించాయి. కానీ మిగిలి ఉన్న రెండు స్థానాల కోసం కొన్ని టీమ్స్ ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లలో హోరాహోరీగా తలబడుతూ ఉండడం గమనార్హం. దీంతో ఇక ఈ క్వాలిఫైయర్ పోరు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పాలి.


 ముఖ్యంగా ఈ క్వాలిఫైయర్స్ మ్యాచ్లలో భాగంగా అటు పసికూనా టీమ్గా ఉన్న జింబాబ్వే చూపిస్తున్న తెగువ ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేసేస్తూ ఉంది. క్రికెట్ ప్రపంచం చూపును ఒక్కసారిగా తమ వైపుకు తిప్పుకుంటుంది ఆ టీం. వరుసగా విజయాలు సాధిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే సాధించిన పాయింట్ల దృశ్య వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అన్నది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆటగాళ్లు కూడా వరల్డ్ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ క్వాలిఫైయర్స్ మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ పరుగుల వరద పారిస్తున్నాడు.


 ఇప్పుడు వరకు జింబాబ్వే తరఫున ఆడిన ఐదు మ్యాచ్ లలో కూడా మూడు సెంచరీలు సహా 149 స్ట్రైక్ రేటుతో ఏకంగా 532 పరుగులు చేశాడు ఈ బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే వరుసగా ఐదు మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే ఇలా వరుసగా ఐదు మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ళలో కోహ్లీ 596 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం ఐదు మ్యాచ్ లలో 537 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ మథ్యు హెడెన్ 529, పకార్ జమాన్ 515 పరుగులతో తర్వాత స్థానాలలో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wc