
అయితే ఇప్పటికే రికార్డుల విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే అందనంత ఎత్తులో ఉన్న విరాట్ కోహ్లీ ఇంకా జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాడిలాగే ఎంతో కసితో ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు అని చెప్పాలి అయితే కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా సారధిగా కూడా టీమిండియాకు ఎన్నో ఏళ్లపాటు సేవలందించాడు. అయితే విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగిన తర్వాత ఎంత ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఎనర్జీనే ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటుంది అని చెప్పాలి.
ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు వికెట్లు తీసినప్పుడు విరాట్ కోహ్లీ చేసుకునే సంబరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎప్పుడు అగ్రసీవ్ గా కనిపించే విరాట్ కోహ్లీ. ఇక అటు చాలాసార్లు సహచరులతో సరదాగా కూడా ఉంటూ టీస్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి ఇక ఇటీవల ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా విరాట్ కోహ్లీ చేసిన పని నవ్వులు పూయించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాధన చేసిన కోహ్లీ.. ఒక బంతికి చక్కని షాట్ ఆడాడు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి అన్నట్లు బౌలింగ్ వేసిన పాండ్య చూస్తుంటే కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండరీ దాటడం పక్క అన్నట్లు డాన్స్ చేస్తాడు. ఈ క్రమంలోని ఫీల్డ్ అంపైర్ ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఇక స్టెప్పులు వేశాడు ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.