2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా భారతీయ అభిమానులు ఎదురుచూశారు, కానీ దురదృష్టవశాత్తు వర్షం కారణంగా దానికి అంతరాయం ఏర్పడి రిజర్వ్ డేకి వాయిదా పడింది. అయితే, మ్యాచ్ ఆడకపోయినా, పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది హార్ట్ టచింగ్ పనిచేసి అందర్నీ ఫిదా చేశాడు. మ్యాచ్ రద్దు అయిన తర్వాత, అఫ్రిది భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వద్దకు వెళ్లి తండ్రి అయినందుకు అభినందనలు తెలిపాడు. ఆపై అఫ్రిది బుమ్రా కొడుకు కోసం బహుమతిని అందించాడు. ఈ చర్య బుమ్రాని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు మన టీమ్ ఇండియా ప్లేయర్ అతడి ప్రేమకు ఫిదా అయిపోయాడు. "వెరీ స్వీట్ ఆఫ్ యు, థాంక్యూ" అని చెప్పడం కంటే ఇంకేం చేయగలను అన్నట్లు బుమ్రా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

అఫ్రిది చేసిన ఈ పని , క్రికెట్ మైదానంలో వారి దేశాలు తరచుగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, భారతదేశం, పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య ఉన్న గొప్ప క్రీడాస్ఫూర్తి, స్నేహాన్ని గుర్తుచేస్తుంది. ఇది హార్ట్ టచింగ్ మూమెంట్, ఇది రెండు జట్ల అభిమానులకు కచ్చితంగా గుర్తుండిపోతుంది.

ఇకపోతే రీసెంట్ మ్యాచ్ రెండు జట్ల టాలెంట్‌ను కూడా హైలైట్ చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల వద్ద పటిష్ట స్థితిలో ఉండగా, ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ లు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాకిస్థాన్ కూడా మెరుగ్గా ఉంది. మ్యాచ్ ఇప్పుడు రిజర్వ్ రోజున పునఃప్రారంభించబడుతుంది. అది ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ఫలితంతో సంబంధం లేకుండా, అఫ్రిది క్రీడాస్ఫూర్తి, స్నేహం గుర్తుండిపోతుంది.

జస్ప్రీత్ బుమ్రా, అతని భార్య సంజన సోమవారం తమ కుమారుడు అంగద్‌కు స్వాగతం పలికారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు బుమ్రా తిరిగి భారత క్రికెట్ జట్టులోకి వచ్చాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం ఆట నిలిచిపోయే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: