ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్రిని ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా ఎన్నో రోజులు సమయం లేదు. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ లో పాల్గొనబోయే 10 టీమ్స్ కూడా ఇప్పటికే భారత గడ్డపై అడుగు పెట్టాయి. ఇక అధికారిక మ్యాచ్ లు ప్రారంభం కావడానికి ముందు ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీమ్ పాల్గొంటుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతోంది


 ఈ క్రమంలోనే ఈ నిషేధం నేపథ్యంలో ఇక భారత్లో వరల్డ్ కప్ ఆడటానికి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆ దేశ జట్టుకు అనుమతి లభిస్తుందా లేదా అనే విషయంపై అందరూ చర్చించుకున్నారు. అయితే ఎట్టకేలకు ఇక పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం అదే సమయంలో ఇక భారత ప్రభుత్వం కూడా పాక్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేయడంతో.. ఇక భారత్లో జరిగే వరల్డ్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ కు లైన్ క్లియర్ అయింది అని చెప్పాలి. అయితే ఇక పాకిస్తాన్ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చింది పాకిస్తాన్ జట్టు. హైదరాబాద్ లో వార్మప్ మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా హైదరాబాద్కు చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అచ్చం పాకిస్తాన్లో ఎలా అయితే ఇక ఆటగాళ్లకు స్వాగతం పలుకుతారో.. అచ్చం అలాగే స్వాగతం పలికారు. లాహోర్, కరాచీలో అభిమానులు ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో.. హైదరాబాదులో కూడా అలాగే కనిపించింది. మా జట్టుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇలా హైదరాబాద్లో లభించిన స్వాగతంతో ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ఏ మ్యాచ్ లోనైనా సెంచరీకి ఉండే క్రేజ్ ఒకటే. నా ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా.. బాబర్ నేను స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తాం అంటూ  మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: