సొంత గడ్డపై వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్న టీమ్ ఇండియా అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఏడు మ్యాచ్లలో ఏడు విజయాలు సాధించి ఇక సెమి ఫైనల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా తర్వాత ఇక సెమి ఫైనల్లో నిలువబోయే మూడు టీమ్స్ ఏవి అన్న విషయంపై మాత్రం కాస్త కన్ఫ్యూషన్ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు వరుస పరాజయాలతో సతమతమైన టీమ్స్ సైతం ప్రస్తుతం అదరగొడుతూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. దీంతో ఇక పాయింట్లు పట్టికలో కూడా తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇక లీగ్ దశలో ఉన్న తొమ్మిది మ్యాచ్లు పూర్తయ్యేసరికి.. ఎవరు సెమీఫైనల్ లో నిలుస్తారు.. ఎవరు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు అనే విషయాన్ని విశ్లేషకులు కూడా ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే ఇంగ్లాండు, బంగ్లాదేశ్,  నెదర్లాండ్స్ జట్లు సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించాయి. ఇక ప్రస్తుతం సెమీఫైనల్ చేరడానికి ఏ జట్టుకు ఎంత శాతం వరకు అవకాశం ఉంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఆ వివరాలు చూసుకుంటే ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ కోసం క్వాలిఫై అయి పోయింది అయితే ఇక పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతున్న సౌత్ ఆఫ్రికాకు 95% సెమీఫైనల్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇక మొదట్లో తడబడిన ఆ తర్వాత అద్భుతంగా దూసుకొచ్చిన ఆస్ట్రేలియాకు 85% సెమీస్ అవకాశాలు ఉన్నాయి ఇక న్యూజిలాండ్ కు 60%  ఆఫ్ఘనిస్తాన్ కు 40 శాతం పాకిస్తాన్ కు 25% నెదర్లాండ్స్ శ్రీలంక ఇంగ్లాండ్ టీమ్స్ కి 0.5% అవకాశం ఉంది అని చెప్పారు. అయితే మరో విజయం సాధించింది అంటే అటు సౌత్ఆఫ్రికా సెమీఫైనల్ లో అడుగు పెట్టడం కాదు ఇది గవర్నమెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc