గత కొంతకాలం నుండి టీమిండియా కోచ్ గురించి తెగ చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. భారత జట్టు హెడ్ కోచ్ గా ఎవరూ రాబోతున్నారు అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అతను కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఎంతో విజయపతంలో ముందుకు సాగింది. మూడు ఫార్మర్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలవగలిగింది. అంతేకాదు ఇక వరల్డ్ కప్ లో కూడా టీమిండియాను ఫైనల్ వరకు తీసుకువెళ్లడంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంతో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ముగించడంతోనే ఇక కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం కూడా ముగిసింది. అయితే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ పెద్దగా ఆసక్తితో లేడు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా కు కొత్త కోచ్ రాబోతున్నాడు అంటూ కొంతమంది మాజీల పేర్లు కూడా తెరమీదకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ఇక పూర్తిస్థాయి హెడ్ కోచ్గా మారబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.


 అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను విజయపతంలో నడిపిస్తున్న రాహుల్ ద్రావిడ్ నే మరోసారి హెడ్ కోచ్ గాని నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే కేవలం హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్  మాత్రమే కాదు సహాయక సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్గా విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మామ్రే, ఫీల్డింగ్  కోచ్ గా టీ. దిలీప్ ను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే రాహుల్ ద్రావిడ్ మరోసారి టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: