ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఒక్కో మ్యాచ్ ఒక్కో వేదికలో జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తమను ఓడించిన ఆస్ట్రేలియా తోనే  సొంత గడ్డపై టీమ్ ఇండియా టి20 సిరీస్ ఆడుతూ ఉంది. అయితే వరల్డ్ కప్ లో ఓవటంతో నిరాశలో మునిగిపోయిన ప్రేక్షకులందరికీ కూడా ఇక ఇప్పుడు టి20 సిరీస్ ద్వారా ఉపశమనం కలిగిస్తుంది టీమిండియా. ఎందుకంటే కుర్రాళ్లతో కూడిన జట్టు టి20 సిరీస్లో అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోకపోతే.. ఇప్పుడు నిరూపించుకోకపోతే మరో ఛాన్స్ రాదేమో అన్నట్లుగా ఇక జట్టులోని యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అదరగొట్టేస్తున్నారు.


 ఇక బ్యాటింగ్లో ఆటగాళ్లు చూపిస్తున్న తెగువ చూసి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యంగ్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా టీం లోని సీనియర్స్ అందరిని కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆసిస్ పై రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించింది టీమిండియా. ఇక ఇటీవలే జరిగిన మూడో టి20 మ్యాచ్ లో మాత్రం ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి.


 అయితే మూడో టి20 మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ  టీమిండియాలో యంగ్ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజ్ మాత్రం ఏకంగా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. టి20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా పై సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై టి20 ఫార్మేట్ లో ఏ ఒక్క భారత క్రికెటర్ కూడా శతకం సాధించలేదు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఋతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు. 57 బంతులు ఎదుర్కొని 123 పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: