కోలీవుడ్ హీరో అయినప్పటికి అటు తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో దళపతి విజయ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత కోలీవుడ్లో ఆ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు దళపతి విజయ్. అయితే అతని నటనకి అతని డాన్సులకి కూడా కోట్లాదిమంది అభిమానులు ఇప్పటికే ఫిదా అయిపోయారు. కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాకుండా అటు టాలీవుడ్ లో కూడా తన సినిమాలను విడుదల చేసి ఇక్కడ కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఈ హీరో.


 ఇక దళపతి విజయ్ నటించిన ఎన్నో సినిమాలు అటు తెలుగులో కూడా డబ్బు అవుతూ ఇక్కడ సూపర్ హిట్ కొడుతూ ఉంటాయి అని చెప్పాలి . లోకల్ హీరోలు సినిమాలకు సైతం దళపతి విజయ్ సినిమాలు మంచి పోటీ ఇస్తూ ఉంటాయి. అయితే ఇక విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్సులు దక్కించుకోవాలని ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సైతం ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోరుకున్నట్లుగానే దళపతి విజయ్ సినిమా నుండి ఒక ఆఫర్ వస్తే తప్పకుండా ఓకే చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యంగ్ హీరోయిన్ మాత్రం ఏకంగా విజయ్ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట  అదేంటి యంగ్ హీరోయిన్ అంటున్నారు.. అలాంటి అమ్మాయికి విజయ్ దళపతి సినిమా ఆఫర్ అంటే పెద్ద చాన్సే కదా అంటారా.


 అయితే దళపతి విజయ్ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. కానీ హీరోయిన్గా కాదు ఏకంగా విజయ్ చెల్లెలి పాత్రలో నటించేందుకు అవకాశం రావడంతో చివరికి లవ్ టుడే ఫేమ్ ఇవానా నొ చెప్పిందట  ప్రస్తుతం విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని సినిమాలో నటిస్తున్నాడు. టైం ట్రావెల్ నేపథంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు విజయ్ దళపతి  అయితే విజయ్ చెల్లి పాత్ర కోసం ఇవానాని సంప్రదించగా ఆమె నొ చెప్పారట. చెల్లి పాత్ర చేస్తే హీరోయిన్ అవకాశాలు తగ్గే అవకాశం ఉందని కారణం చెప్పారట. దీంతో ఈ పాత్ర కోసం మోడల్ అభియుక్తని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: