టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కూడా టీమిండియాలో అతను స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో లెజెండ్ గా ఎదిగాడు అని చెప్పాలి. అంతేకాదు భారత జట్టులో మాత్రమే కాకుండా.. అటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా తెలివైన స్పిన్నర్ల జాబితాలో అతని పేరు టాప్ ప్లేస్ లో వినిపిస్తూ ఉంటుంది.


 అయితే ఎప్పుడు తన స్పిన్ బౌలింగ్ తో ఆశ్చర్యపరిచే రవిచంద్రన్ అశ్విన్.. కొన్ని కొన్ని సార్లు బ్యాటింగ్ తో కూడా అదరగొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. మరి కొన్నిసార్లు క్రికెట్ రూల్స్ ని అందరికీ గుర్తు చేస్తూ.. ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు అశ్విన్. అయితే మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే అశ్విన్ కాస్త అగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నవాడే. ఇక ఏకంగా ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవ పడడానికి కూడా ఎప్పుడు వెనకడుగు వేయడు అని చెప్పాలి. అయితే ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ తన సహచరుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఒక్కటి పీకితే పళ్ళు రాలుతాయి అన్న రేంజ్ లో ఏకంగా తన టీం మేట్ కి వార్నింగ్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ గా సాగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా చపాక్ సూపర్ గల్లీస్, దిండిగల్ డ్రాగన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో దిండిగల్ డ్రాగన్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇటీవల మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోపంతో ఊపిపోయాడు. చేజింగ్ సమయంలో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా.. దిండిగల్ బ్యాటర్ శరత్ బంతిని గాల్లోకి లేపాడు. అదృష్టవశాత్తు అది క్యాచ్ మిస్ అయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశ్విన్.. ఇలాగేనా బ్యాటింగ్ చేసేది.. కొడితే పళ్ళు రాలుతాయి అన్న రేంజ్ లో పెవిలియం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: