టూ వీలర్స్ ఎంత జాగ్రత్తగా నడిపినా ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. వాటి వల్ల తీవ్ర గాయాలపాలవడమే కాకుండా.. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా అవుతుంది. కార్లలో అయితే ఎయిర్‌బ్యాగ్‌లు వంటి చాలా సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. కానీ, బైక్స్‌కి మాత్రం అసలు అలాంటివేవీ ఉండవు. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకుని, బైక్ డ్రైవర్ల కోసం స్వీడిష్ కంపెనీ ప్రత్యేకంగా ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను రిలీజ్ చేసింది. ఇది అత్యవసర, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఓపెన్ అయి వెంటనే రైడర్ ప్రాణాలను కాపాడుతుంది.ఇక స్వీడిష్ బ్రాండ్ మో సైకిల్ ఎయిర్‌బ్యాగ్ ఫీచర్‌తో కూడిన జీన్స్‌ను సూపర్ గా డిజైన్ చేసింది. బైక్ రైడర్ కింద పడితే వెంటనే ఈ జీన్స్ నుంచి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఇంకా అది రైడర్ శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన ఈ జీన్స్ లు చూడటానికి సాధారణ ప్యాంట్‌ల లాగానే ఉంటాయి.అయితే వాటిలో ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ను వాడారు. ఇది వేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.ఇక ఈ జీన్స్‌లో CO2 (కార్బన్ డయాక్సైడ్) క్యాట్రిడ్జ్ కూడా ఇవ్వబడింది.


 దీన్ని ఈజీగా మార్చుకోవచ్చు కూడా. అయితే ఒకసారి వాడితే మళ్లీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ జీన్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ జీన్స్ ధరించిన తర్వాత, అందులో ఇచ్చిన స్ట్రిప్‌ను బైక్‌లోని ఏదైనా భాగానికి షాకర్, ఫ్రేమ్ ఇంకా అలాగే ఫుట్‌రెస్ట్ వంటి వాటికి కట్టాలి. బైక్ రైడర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం కారణంగా కింద పడిపోయినప్పుడు వెంటనే ఈ జీన్స్‌లోని స్ట్రిప్ యాక్టీవ్ అవుతుంది. అప్పుడు వెంటనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది.అలాగే దీన్ని ఉతకడం కోసం స్పెషల్ ఏర్పాట్లు చేశారు తయారీదారులు. ఎయిర్ బ్యాగ్ జీన్స్‌ను రెండు విధాలుగా డిజైన్ చేశారు. దీనిని మనం సాధారణ దుస్తుల్లాగే వాడుకోవచ్చు. ఇక జీన్స్ లోపల ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు జీన్స్‌ను ఉతకాలనుకుంటే.. ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్‌ను తీయాలి.ఇక ఆ తరువాత సాధారణ జీన్స్ లాగానే ఉతకవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: