
అయితే ఈ షో ఇంతటి పాపులర్ కావడానికి గల కారణం.. చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటివారిలో చమ్మక్ చంద్ర ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చమ్మక్ చంద్ర లేడీ గెటప్ తో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించారని చెప్పవచ్చు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు సైతం చమ్మక్ చంద్ర గురించి స్కిట్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. దీంతో ఈటీవీ యొక్క టీఆర్పీ రేటింగ్ ఒకసారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా అద్భుతమైన కామెడీ స్కిట్లతో ఇతర కమెడియన్స్ కూడా కామెడీతో బాగా ఆకట్టుకోవడం వల్ల దాదాపుగా పది సంవత్సరాలు అయిన జబర్దస్త్ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఒకానొక సమయంలో చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్ లేకపోతే ఈ షో ఇంతకాలం కొనసాగేది కాదంటూ కూడా కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. జబర్దస్త్ వచ్చిన అనూహ్య స్పందనకి కారణం చమ్మక్ చంద్ర అనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది కమెడియన్స్ భాగస్వామ్యం వహించారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.మళ్ళీ ఆయన జబర్దస్త్ లోకి తీసుకురావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చమ్మక్ చంద్ర కు మాత్రం పెద్దగా ఆసక్తి లేదని తెలియజేసినట్లు సమాచారం.