
ఇది ప్రసారమైన అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షక ఆదరణ పొంది భారీ టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులకు కూడా ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కింది. ఈ సీరియల్లో నటిస్తున్న మాలిని ఈటీవీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ప్రేమనగర్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తన అందం, నటన ,అభినయంతో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలో జన్మించిన మాలిని అసలు పేరు దీపా జగదీష్. ప్రస్తుతం ఈమె బెంగళూరులో నివాసం ఉంటుంది.
కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో లా పట్టా అందుకుంది దీపా.ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో నటననే కెరియర్గా మార్చుకున్నారు దీపా. మహాసతి అనే సీరియల్ తో దీప కన్నడ బుల్లితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. వారొస్తారా, బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి వంటి కన్నడ సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. కన్నడ సీరియల్స్ లోనే కాదు కన్నడ సినిమాలలో కూడా నటించి అక్కడ ఫేమ్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు ఇలా తెలుగు సీరియల్స్ లోకి అడుగుపెట్టి తన సత్తా చాటుతోంది.