రేటింగ్ అనేది ఒక్కోసారి ఎంత కష్టపడినా కూడా సరిగ్గా అనుకున్న రేంజ్ లో రాదు. మరికొన్ని సార్లు అసలు రేటింగ్ రాదేమో అని అనుమానించే సందర్భాల్లో ఒక్కోసారి విపరీతమైన రేటింగ్ కనపడుతూ ఉంటుంది. అదే టీవీ చానల్స్ కి సంబంధించిన మాయ. ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ కి సంబంధించి అలాగే ఉంటుందని తెలుస్తుంది. జెమిని న్యూస్ మొదలైన కొత్తలో అది ఇంకా చెప్పాలంటే వెనకబడి ఉండేది.


అప్పుడు ఫ్లాష్ న్యూస్ లు, బ్రేకింగ్ న్యూస్ లు ఇలాంటివి కొత్తలో ఉండేవి కాదని తెలుస్తుంది. స్క్రోలింగ్ కూడా ఉండేవి కావు. ఇంకో విషయం ఏమిటంటే పే ఛానల్ కాబట్టి పే చేయకపోవడం వల్ల జెమినీ న్యూస్ కి పెద్దగా రీచ్ ఉండేది కాదు. కేబుల్ లో రాకపోవడం వల్ల అది డిజిటల్ లో ప్రసారమవుతూ ఉండేది. దాంతో ఎప్పుడో ఆగిపోయింది అనుకున్నటువంటి జెమిని న్యూస్ సరికొత్తగా కనిపించే సరికి అది కాస్త టాప్ త్రీ రేటింగ్లోకి వెళ్ళిపోయింది.


రెండు మూడు వారాలు అదే ఫ్లో కొనసాగుతూ ఉన్నందువల్ల మేనేజ్మెంట్ ని గ్రౌండ్ లెవెల్ లో ఇప్పించండి అని అడిగితే ముందు మీరు ఇప్పుడున్న ఫ్లోలో ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగిందట. ఆ తర్వాత ఎంఎస్ఓ లను అడగడం మొదలుపెట్టాక వాళ్ళు దాన్ని ఫ్రీ చేసేసరికి టాప్ సెవెన్  స్థానంలోకి వెళ్లిందట జెమిని న్యూస్.


ఏఎన్ఆర్ గారు మరణ వార్త సందర్భంలోనూ, దిల్ సుఖ్ నగర్ ఇన్సిడెంట్ సందర్భంలోనూ స్పీడ్ గా స్పందించి వాళ్ల పరిమితిలోనే గట్టిగా కష్టపడి మరీ చూపించారు. దాంతో చాలా కాలం పాటు నైంత్ ప్లేసు, ఎయిత్ ప్లేస్ ఈ స్థాయిలోనే కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టాప్ టెన్ లోనే ఉండేది. అయితే ఇప్పుడు ఎన్ టీవీ రేటింగ్ చూసి టీవీ9 అవి నిజమైన రేటింగులు కాదన్నట్లుగా మాట్లాడుతుందట. ఇలా ఉంది టీవీ9 వ్యవహారం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: