రీసెంట్గా కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ లో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ కంటెస్టెంట్ గా ఉన్నారు. అలాగే జడ్జిగా అనసూయ కూడా ఉన్నది. అయితే వీరిద్దరి మధ్య హిట్ డిస్కషన్ నడిచిన సంగతి తెలిసిందే..ముఖ్యంగా మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావ్ అని అనసూయ అనగా.. అలా మాట్లాడే హక్కు మాకు కూడా ఉందంటూ నిఖిల్ వ్యవహరించారు.ఇలా వీరిద్దరి మధ్య ఒకరినొకరు దూషించే విధంగా మాట్లాడుకున్నారు ఆ ఎపిసోడ్ ప్రోమో కూడా వైరల్ గా మారడంతో అటు నిఖిల్, అనసూయ ఫాన్స్ మధ్య వార్ జరిగింది.


ఈ విషయం పైన నిఖిల్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి  బయటికి వచ్చిన తర్వాత లైఫ్ బాగానే కొనసాగుతుందని లైఫ్ అనేది కూడా ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది.. ఎలా మార్చుకుంటే అలా మారుతూ ఉంటుందని తెలిపారు. నా వరకు నా లైఫ్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని నా పని నేను చేసుకుంటూ వెళుతున్నానని తెలిపారు నిఖిల్. బిగ్ బాస్ తర్వాత తనకు వచ్చిన ఆఫర్లు తానే సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళుతున్నానని అందుకే కవర్ సాంగులు చేశానని తెలిపారు.


అందుకే చిన్నదైనా పెద్దదైన అవకాశం నచ్చితే తాను చాలా కష్టపడతానని తెలిపారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలలో నటిస్తున్నానని అందరూ డబ్బా కొట్టారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాలో కూడా చేయలేదు. కనీసం సీరియల్స్ కూడా చేయలేదు.. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో గొడవలపై మాట్లాడుతూ ఇలాంటి గొడవలు కామన్ గానే వస్తూ ఉంటాయి తనని ఇష్టపడేవారు కొందరు ఉంటారు మిగిలిన వారికి నచ్చకపోవచ్చు అషో కూడా రియల్ ఎమోషన్స్ ఏది స్క్రిప్ట్ కాదు..ఇక అనసూయతో గొడవ పై అక్కడ అందరికీ మాట్లాడే రైట్స్ ఉంటాయి కానీ అక్కడ వాళ్ళు తప్పు చేసిన ఒప్పుకోరు..ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి కానీ కొంతమంది కామెంట్స్ లలో కూడా ఏదో ఒకటి తిడుతూ ఉంటారు అంటూ తెలియజేశారు నిఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: