ఎ షో అయినా హిట్ కావాలి అంటే సరైన కంటెస్టెంట్స్, యాంకర్స్ ,ఆర్టిస్టులు ఇలా అన్ని కలిస్తేనే ఏదైనా షో సక్సెస్ అవుతుంది. అలా జబర్దస్త్ షో మొదలుపెట్టి ఇప్పటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో మల్లెమాల సంస్థ కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవలే ఒక టీజర్ ని కూడా విడుదల చేయగా అప్పట్లో ఉండే జబర్దస్త్ టీమ్ లీడర్లనే కాకుండా యాంకర్స్ ని ,జడ్జిలను కూడా పిలవడం జరిగింది. అయితే ఇందులో కొంతమంది మాత్రం కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు.


అందులో జడ్జిగా ఉన్న ఒకరు రోజా కాగా మరొకరు జబర్దస్త్ కంటెస్టెంట్ టీమ్ లీడర్ అయినా సుడిగాలి సుదీర్. తాజాగా విడుదలైన ప్రోమోలో సుధీర్ కూడా కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న షో ఫ్యామిలీ స్టార్స్ షో కి కూడా యాంకర్ గా ఉన్నారు. వీటితో పాటు ఇతర చానల్స్ లో కూడా రెండు షోలు చేస్తున్నారు సుదీర్. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఆడియన్స్ ని మెప్పించిన టీమ్ లీడర్గా సుధీర్ కి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.


అలాంటి సుదీర్ ఇప్పుడు అక్కడ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ఫాన్స్.. మరి మల్లెమాల సంస్థ సుదీర్ ని పిలవలేదా అనే ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది?. లేకపోతే జబర్దస్త్ షో వల్ల ఏదైనా ఇబ్బందులు తలెత్తయ అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నాక మారింది. సుధీర్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో జ్ఞాపిక ప్రొడక్షన్ చేస్తోందట. దీన్నిబట్టి చూస్తూ ఉంటే మల్లెమాల ప్రొడక్షన్ తో సుధీర్ కి విభేదాలు ఉన్నాయా అనేటట్టుగా పలువురు అభిమానులు, నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో అని కూడా వదిలేశారు.. ఏది ఏమైనా ఒక షో అరుదైన మైలురాయి అందుకునేటప్పుడు కీలకమైన వ్యక్తులు ఉంటేనే ఆడియన్స్ కి ఫుల్ కిక్ అని చెప్పవచ్చు. మరి జడ్జ్ రోజా, సుధీర్ ఎందుకు రాలేదో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: