మీరు కొత్త ఫోన్ ని కోలుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా...? అయితే మీకు శుభవార్త. అవే వన్‌ప్లస్ నార్డ్ ఎన్100, 10.  ఈ రెండు కొత్త ఫోన్లను తీసుకు రావడానికి కంపెనీ సిద్ధం అయ్యింది.  ఈ ఫోన్ల వివరాలకి వెళితే... వన్‌ప్లస్‌ నార్డ్‌ 10 5జీ, వన్‌ప్లస్‌ నార్డ్‌ ఎన్100 పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో పాటు నార్డ్ సిరీస్‌లోనే తక్కువ ధరకు వీటిని అందిచనున్నారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే....

వన్‌ప్లస్‌ నార్డ్‌ 10 ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 690 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇస్తున్నారట.  ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ప్లస్ కొత్త ఆక్సిజన్‌ ఓఎస్‌ 11తో పనిచేస్తుందట. 6జీబీ ర్యామ్/128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్‌లో ఈ నార్డ్‌ 10 5జీ లభించనుంది. ధర రూ.30,000లోపు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే....  ఇందులో వెనక మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా వచ్చేసి  64 ఎంపీ అలానే దీనితో  పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఇస్తున్నారని సమాచారం. బ్యాటరీ  సామర్ధ్యం వచ్చేసి  4,300 ఎంఏహెచ్‌ గా ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్100

ఇది ఇలా ఉండగా నార్డ్ ఎన్‌100ను 4జీ ఫోన్‌గా కూడా వస్తుంది. ఫీచర్స్ లోకి వెళితే.....  60 హెచ్‌జడ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందట. స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌తో పనిచేస్తుందని సమాచారం.   ధర రూ. 15,000లోపు ఉండొచ్చని అంచనా. కెమెరాలు నాలుగు ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: