మనం ప్రతి రోజూ ఏదో విధంగా రోడ్డుపై ఇరువైపుల గమనిస్తూనే  ఉంటాం. బస్సులు, కార్లు, బైకులు హైవే రోడ్ల పై వెళుతూ ఉంటాం. అలా వెళ్లేటప్పుడు రకరకాల "మైల్ స్టోన్స్" గమనిస్తూ ఉంటాం.  బోర్డ్ లపై పలాన ప్రదేశము, ఇంత దూరంలో ఉందని చెప్పే బోర్డులు కాకుండా రాళ్ళపై వాటిని గురించి వేసిన మొబైల్ స్టోన్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో కొన్ని రకరకాల రంగులతో ఉంటాయి. అసలు ఈ మైల్ స్టోన్ కి ఇన్ని రంగులు ఎందుకు ఉంటాయి.  అన్నీ ఒకే రంగులో ఎందుకు ఉండవు.. అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అయితే అలాంటి సందేహం ఉన్నవారు ఇప్పుడు  తెలుసుకోండి.


అసలు మైల్ స్టోన్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఇది రోడ్డుకి ఇరుపక్కల ప్రదేశంలో, ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉందని చెబుతూ... మనం చేరుకోవలసిన ప్రదేశానికి  ఎంత సమయం పడుతుందో అన్న సూచికను మనకు అందిస్తుంది. మన దేశంలోని రోడ్డు వ్యవస్థ చాలా పెద్దది. గ్రామ స్థాయి,రాష్ట్ర స్థాయి,హైవేలు,నేషనల్ హైవే లు ఇలా పలు రకాల రోడ్లు ఉంటాయి. ప్రతి రోడ్ కి దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. మరి ఈ మైల్ స్టోన్ లో తేడా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి.

1). నారింజరంగు మైల్ స్టోన్ : మీకు కనిపిస్తే అది  గ్రామ స్థాయి రోడ్లు అని భావించాలి. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(pmgsy), జవహర్ రోజ్ గార్ యోజన (jry) వంటి పథకాల ద్వారా ఈ రోడ్ లను నిర్మిస్తారు. మనదేశంలో ఈ రోడ్లు 3.93 లక్షల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి.

2). పసుపు రంగు మైల్ స్టోన్: ఈ పసుపు రంగు మైల్ స్టోన్ కనిపిస్తే మీరు ప్రయాణిస్తున్నది నేషనల్ హైవే మీద అని తెలుసుకోవచ్చు.

3). ఆకుపచ్చ  రంగు మైల్ స్టోన్ : ఈ రంగు మైల్ స్టోన్ కనిపిస్తే మీరు స్టేట్ హైవే లో ప్రయాణిస్తున్నట్లు తెలుపుతుంది.

4). నలుపు లేదా గోధుమ  రంగు మైల్ స్టోన్: ఈ రంగు గల మైల్ స్టోన్ కనిపిస్తే, మీరు ఉన్న ప్రాంతం నుంచి ఒక పెద్ద సిటీ లేదా మండలానికి వెళుతున్నారని అర్థం.

ఈ విధంగా మన దేశంలో ఉండేటువంటి మైల్ స్టోన్ రంగుల వివరాలు..


మరింత సమాచారం తెలుసుకోండి: