ఆధునిక సాంకేతిక మారుతున్న కొద్దీ కస్టమర్ల కోసం మొబైల్ తయారీ సంస్థలు, అలాగే దిగ్గజ సాప్ట్ వేర్ కంపెనీలు ప్రతిసారీ ఏదో ఒక కొత్త టెక్నాలజీని వినియోగదారుల కోసం అందించడం జరిగుతోంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు విండోస్ 11 మన ముందుకు వచ్చింది. కానీ ఈ ఓ ఎస్ ను మొబైల్ ఫోన్లలో ఉపయోగించాలంటే , కంప్యూటర్ లోని కొన్ని ఫీచర్స్  కచ్చితంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. అదేమిటో తెలుసుకుందాం.

కొంతమంది వినియోగదారులు కంప్యూటర్ లో  విండోస్ పనిచేయడం లేదని కంప్లైంట్ చేయడం తో పాటు  మైక్రోసాఫ్ట్  ఫీచర్స్ తో అసంతృప్తి గా  ఉన్నారు. ఇక ఇదే తరుణంలో ఒక బీటెక్ చదివిన విద్యార్థి తనదైన శైలిలో ఒక పని చేసి , అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రష్యా దేశానికి చెందిన"గుస్తావే మోన్సే" అనే విద్యార్థి లూమియా 950 ఎక్స్ ఎల్  మొబైల్ లో విండోస్ 11 ని ఇన్స్టాల్ చేసాడు. ఇక  దీనికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

విండోస్ 11 ని మొబైల్ లోకి ఇన్స్టాల్ చేయడం ద్వారా మొబైల్ ఎంతో చక్కగా పని చేస్తోంది. అలాగే మొబైల్ హ్యాంగ్ కాకుండా కూడా ఉంది మరియు కంప్యూటర్ మాదిరి పని చేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో ఒకవేళ కింద చూపించిన వీడియో లో ఉంది చూడండి. స్టార్ట్, సెర్చ్ బటన్ తో పాటు.. స్క్రీన్ యొక్క ఎడమ వైపున విడ్జెస్ట్ అనే ఆప్షన్ ను కూడా మనకి కల్పించింది. సాధారణంగా విండోస్ 11 సిస్టంలోనే బాగా పనిచేస్తుంది. కానీ మొబైళ్లలో ఈ windows 11 పనితీరు కొంచెం స్లో గా ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ విండోస్ 11 మాత్రం ఫోన్లలో చక్కగా పని చేస్తోందని మోన్సే తెలిపాడు.
ఇక నోకియా(micro software) లూమియా ఫోన్ లలో  windows 11  OS ను ఇన్స్టాల్ చేయడం కోసం నాలుగు సంవత్సరాలుగా కష్టపడ్డామని  తెలిపాడు."గుస్తావే మోన్సే" దీనిని మొదటిసారిగా తన 15 మంది స్నేహితులతో కలిసి" windows on windows phones " అనే పేరుతో ఒక ప్రాజెక్టును మొదలు పెట్టినట్లు తెలిపారు. వారు విడుదల చేసిన విండోస్ 10 / విండోస్ 11 ఓ ఎస్ ను ఎవరైతే తమ లూమియా 950 మోడల్స్ లో ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారో, అలాంటివారికి వారికి  తమ వెబ్సైట్ ద్వారా గైడ్ లైన్స్  అలాగే టూల్స్ తో సహకారం అందిస్తామని తెలిపారు. అయితే మీరు ఎవరైనా పాత లుమియా ఫోన్ లను ఉపయోగిస్తూ ఉంటే ఒకసారి ఈ విండోస్ 11 ను మీ ఫోన్ లలో  ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: