ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజుకి ఒక కొత్త యాప్ పుట్టుకొస్తోంది. ఏ యాప్ వచ్చినా అది వినియోగదారుల ఎంటర్ టైన్మెంట్ కోసమే అని తెలిసిందే. వాటిలో హలోఆప్ కూడా ఒకటి. ఈ ప్రైవేట్ సోషల్
మీడియా యాప్ ను
వాట్సాప్ లో మొట్టమొదటి సారి పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కలిసి రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ యాప్ ఇప్పుడు అన్ని రకాల మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లుగా రెండు రోజుల క్రితం వీరు తెలియచేశారు. ఈ యాప్ ను
ఆపిల్ స్టోర్,
గూగుల్ ప్లే స్టోర్ ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. డౌన్లోడ్ చేసుకున్న తరువాత దీని కొరకు సైన్ అప్ చేసుకోవలసి వస్తుంది. ముఖ్యంగా మనము ఎంతో విరివిగా వాడే
వాట్సాప్ కు మరియు హలోఆప్ కు మధ్యన ఒకే రకమైన ఫీచర్స్ ఉన్నట్లు హలోఆప్ రూపకర్తలు పేర్కొన్నారు. ఇందులో
వాట్సాప్ లాగే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మరియు ఇతర సన్నిహితులతో గ్రూప్స్ ఎలా అయితే చేసుకుని చాట్ చేస్తామో, అదే విధంగా హలోఆప్ లోనూ సౌలభ్యం ఉందని వీరు తెలిపారు. మీరు జరిపే చాట్ లో వారి నెంబర్ ను తెలుసుకోగలరు. ఈ యాప్ వాడే సమయంలో ఎటువంటి వాణిజ్య ప్రకటనలు ఉండవు.

సోషల్
మీడియా విరివిగా వాడే ఈ కాలంలో ఎంతోమంది ఎన్నో రకాల యాప్ లను సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ హలోఆప్ ను కనుగొనబడిన ఇద్దరు సహా వ్యవస్థాపకులు అయిన నీరజ్ అరోరా మరియు మైఖేల్ డోనోహ్యూ లు హలోఆప్ ను సృష్టించి, విజయవంతంగా వినియోగదారుల ముందుకు తీసుకురావడంలో
సక్సెస్ అయ్యారు. ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్లుగా వీరిద్దరూ కూడా
వాట్సాప్ కంపెనీలో పనిచేశారు. మూడు సంవత్సరాల ముందు వరకు అరోరా
వాట్సాప్ లో ఒక ముఖ్యమైన బిజినెస్ ఆఫీసర్ గా ఉన్నారు. పేస్ బుక్ కు
వాట్సాప్ ను అమ్మడంలో ఇతను కీలకంగా వ్యవహరించారు. పేస్ బుక్
వాట్సాప్ ను 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇంకొక సహా వ్యవస్థాపకుడయిన డోనోహ్యూ తొమ్మిది సంవత్సరాలు
వాట్సాప్ లో ఇంజినీరింగ్
డైరెక్టర్ గా తన సేవలను అందించాడు. తమ విజయానికి ప్రతీకగా ఒక ఇంటర్వ్యూ కోసం వీరిని సంప్రదించగా అందుకు వీరు నిరాకరించడం విశేషం. అయితే వీరు ఈ మధ్యనే 'ఫాలో యువర్ డిఫరెంట్' పోడ్ కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఇంటర్ వ్యూ ను
క్రిస్టోఫర్ లోచ్ హెడ్ నిర్వహించడం విశేషం. ఈ ఇంటర్వ్యూ లో ఈ విధంగా అన్నారు, "వినియోగదారులు వారి ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి, వారి భావాలను వ్యక్తపరచడానికి ఒక ప్లాట్ ఫామ్ ను సృష్టించడం చాలా హ్యాపీ అని చెప్పారు. ఈ హలోఆప్ నాలుగు భాగాలుగా చేసి ఉన్నారు. ఈ యాప్
హోమ్ ఫీడ్ లో ఫ్రెండ్స్ చాట్ , గ్రూప్ చాట్ , పర్సనల్ చాట్ మరియు పోస్ట్ ల యొక్క సెట్టింగ్ లుగా చేసి ఉన్నారు. అరోరా ఈ యాప్ గురించి ఒక బ్లాగ్ లో చెబుతూ ఇది 21 వ శతాబ్దపు
సిగరెట్ కు పరిష్కారం గా పేర్కొన్నారు. అరోరా నుండి
వాట్సాప్ ను పేస్ బుక్ కొనుగోలు చేసిన తర్వాత, అక్కడ
వాట్సాప్ సహా వ్యవస్థాపకులు
జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టాన్
వాట్సాప్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారు. కానీ ఈ విషయంలో పేస్ బుక్ తో మనస్పర్థలు గొడవలు రావడంతో వీరిద్దరూ పేస్ బుక్ ను వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఆ తరువాత ఆక్టన్ “#deletefacebook” అనే ట్వీట్ ను పంపి పేస్ బుక్ పై తనకున్న ద్వేషాన్ని చూపించాడు. ఇలా
వాట్సాప్ లో ఇప్పటికి కూడా ఎటువంటి ప్రకటనలు లేకపోవడం విశేషం. కానీ ఇప్పుడు హలోఆప్ ఉపయోగించే వారి నుండి ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తోంది...