సోషల్ మీడియా అనేది ఒక వింతైన మాయా ప్రపంచం. దానిని మంచిగా ఉపయోగించుకునేవారు కొంతమంది అయితే  దుర్వినియోగపరిచేవారు మాత్రం లక్షల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ కూడా ఎన్నో రకాల సైబర్ నేరాలు జరిగి ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి.దీనివల్ల మంచి ప్రయోజనాల కంటే చెడు ప్రయోజనాలే చాలా ఎక్కువగా ఉంటాయి.అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రఖ్యాతి గాంచిన సైట్ ఏంటంటే facebook అనే చెప్పాలి. బ్యాంక్ అకౌంట్ లేని వారైన ఉంటారేమో కానీ, ఫేస్బుక్ అకౌంట్ లేని వారు ఎవ్వరూ వుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఫేస్బుక్ అకౌంట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు.అన్ని వయసుల ప్రజలలో చాలా ఫేమస్ అయింది ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ . ప్రతిరోజు దాదాపు చాలా కోట్లమంది వినియోగదారులు ఇందులో యాక్టివ్‌గా ఉంటారు. అయితే మీరు కూడా facebook ఉపయోగిస్తే మీ ప్రొఫైల్‌కి చాలా మంది కనెక్ట్ అయి మీకు ఫ్రెండ్స్ అవుతారు.అయితే మీకు తెలియకుండా మీ ప్రొఫైల్‌ను రహస్యంగా చూసే వాళ్ళు ఎవరో మీరు కనిపెట్టవచ్చు. నిజానికి ఎఫ్‌బీ ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు.


కానీ ఒక ట్రిక్‌ ఉపయోగించి దీన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అదేమిటో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం..మీ ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ కావాలి. ఇక పేజీ ఓపెన్‌ అయిన తర్వాత 'రైట్‌ క్లిక్‌' చేయాలి. అందులో 'వ్యూ పేజ్‌ సోర్స్‌' అనే ఆప్షన్‌ మీకు కనిపిస్తుంది.ఇక దానిపై క్లిక్‌ చేయాలి.దీంతో వెంటనే పేజీ సోర్స్‌ కోడ్‌ అనేది ఓపెన్‌ అవుతుంది. అందులో 'BUDDY_ID' కోసం సెర్చ్ చెయ్యాలి. ఇందుకోసం కంట్రోల్‌+ఎఫ్‌ (ctrl+F) నొక్కి 'BUDDY_ID' అని మీరు టైప్‌ చేయాలి.ఇక ఇలా 'BUDDY_ID' పక్కన చాలా ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఐడీలు మీకు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని మీరు కాపీ చేసుకోవాలి. ఆ తరువాత కొత్త ట్యాబ్‌ను ఓపెన్‌ చేసి 'Facebook.com/మీరు సెలెక్ట్ చేసుకున్న ఐడీ'ని పేస్ట్‌ చేయాలి.ఇక ఈ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ని ఎవరెవరు చూశారో వారి పేజీ వెంటనే ఓపెన్‌ అవుతుంది. ఇలా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో.. వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా మీరు తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: