చాలా మందికి PF అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనే విషయం తెలుసుకోవడం కోసం ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఆన్లైన్ ద్వారా చూసేవారు.. అయితే కానీ ఇప్పుడు అంతకంటే సులభంగా ఆన్లైన్ ద్వారా కాకుండానే కేవలం ఒక్క మెసేజ్ ద్వారా సులభంగా ఈ బ్యాలెన్స్ను సైతం మనం చెక్ చేసుకుని సదుపాయం కలదు.. అలాగే ఇందుకోసం ఇంటర్నెట్ కావాలన్నా అవసరం కూడా ఉండదు. ఇంటర్నెట్ డేటా లేకుండానే టెక్స్ట్ మెసేజ్ తో ఈజీగా మీ యొక్క PF బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.


మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నుంచి..EPFOHO అని టైప్ చేసి మీ UAN నెంబర్ ని నమోదు చేసి..773829989 అనే నెంబర్ కి మెసేజ్ చేస్తే చాలు.. వెంటనే మీ పిఎఫ్ యొక్క బ్యాలెన్స్ ఎంతుందనే విషయం ఎస్ఎంఎస్ ద్వారా వచ్చేస్తుంది.. ఒకవేళ ఇలా కనుక ఎస్ఎంఎస్ రాకపోతే ఒక్క మిస్డ్ కాల్ ద్వారా అయినా సరే మీ యొక్క బ్యాలెన్స్ ని సైతం చెక్ చేసుకోవచ్చు..9966044425 ఈ నెంబర్ కి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ నుంచి కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో క్షణాలలో మీ ముందు కనిపిస్తుంది.


Pf బ్యాలెన్స్ పైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసే వడ్డీలతో కూడా ఈ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు..PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా EPF వెబ్సైట్ ను ఓపెన్ చేసి అక్కడ పూర్తి వివరాలు ఎంటర్ చేసిన తర్వాతే తెలుసుకొనేలా ఉండేది. కానీ అలా చేయడం వల్ల ఎక్కువ సమయం వృధా కావడం వల్ల ఇంటర్నెట్ డేటా కూడా అవసరమయ్యేది. అందుకే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండానే కేవలం SMS ల ద్వారా లేదా మిస్డ్ కాల్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ ని తెలుసుకొని సదుపాయాన్ని కల్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: