చాలా మంది ఎక్కువ దూరాలు కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు విశ్రాంతి కోసం మధ్యలో హోటల్స్ బుక్ చేసుకుంటారు. లేదా కొంతమంది జంటలు తమ ప్రైవేట్ స్పేస్ కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటారు. అయితే కొన్ని హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేస్తారు. జంటలు ఏకాంతంగా గడిపిన క్షణాలని రికార్డ్ చేసి వాటిని ఇంటర్నెట్ లో కూడా అప్లోడ్ చేస్తారు. అయితే మనం హోటల్స్ కి వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ హిడెన్ కెమెరాలు పట్టుకొని హోటల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.రూంలో ఉంచిన ప్రతి చిన్న విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించండి. ఇంకా దీనితో పాటు గదిలో అమర్చిన గడియారం, అద్దం, ప్లగ్, ల్యాంప్, జాడీ మొదలైన వాటిపై కూడా నిఘా ఉంచండి. ముఖ్యంగా సీలింగ్‌లో అమర్చిన డిటెక్టర్, ఫ్యాన్‌ను చెక్ చేయండి. చాలా సార్లు గదిలో అమర్చిన ఏసీలో కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత మాత్రమే గదిలో ఉండాలి. కొందరు అయితే గదులలో ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్‌ కెమెరాలు అమరుస్తుంటారు. అసలు వాటిని ఎవ్వరు కూడా పసిగట్టని విధంగా అమరుస్తుంటారు.మీరు సీక్రెట్  కెమెరాను చూడలేరు.


దీని కోసం మీరు గదిలో ఉండే లైట్లను ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ప్రతి కెమెరాలో కూడా ఒక రకమైన కాంతి ఉంటుంది. ఇక అది చీకటిగా ఉన్నప్పుడు వెలుగులోకి వస్తుంది. లైట్‌ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచో చిన్న రెడ్ లైట్ అనేది వస్తుంటే ఆ ప్రదేశంలో రహస్య కెమెరా అమర్చబడిందని అర్థం. హిడెన్ కెమెరాలను చెక్ చేయడానికి మీరు లైట్లను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత టార్చ్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఆ టార్చ్ లైట్‌లో ఏదైనా మెరుస్తూ ఉంటే, ఆ ప్రదేశంలో రహస్య కెమెరా అమర్చబడిందని అర్థం.అలాగే మీ ఫోన్‌తో ఎవరికైనా కాల్ చేయండి. ఇక కాల్ సమయంలో మీ వైపు నుండి ఏదైనా శబ్దం లేదా వైబ్రేషన్ విన్నట్లయితే గదిలో ఎక్కడో హిడెన్ కెమెరా ఇన్‌స్టాల్ చేయబడిందని అర్థం. ఇది కాకుండా, మీరు బ్లూటూత్ సహాయంతో కూడా హిడెన్ కెమెరాలను  గుర్తించవచ్చు. దీని కోసం ముందుగా బ్లూటూత్‌ని ఆన్ చేయండి బ్లూటూత్‌ ఆప్షన్‌లో ఏదైనా ఎక్సట్రా డివైస్ ఆప్షన్‌ కనిపిస్తే ఖచ్చితంగా అప్రమత్తం అవ్వండి.ఒకవేళ హిడెన్ కెమెరాలు ఏమైన దొరికితే ఖచ్చితంగా హోటల్ సిబ్బందిపై పోలీసులకు కంప్లైంట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: