ప్రపంచ దేశాలు టెక్నాలజీలో దూసుకెళ్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చైనా. ఈ దేశం ఎప్పుడు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటుంది. దాన్ని పూర్తిగా సక్సెస్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు అమ్మేస్తుంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఇతర దేశాలకు ఎప్పుడూ దిగుమతి అవుతూనే ఉంటాయి. ఆ విధంగా టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన చైనా మరో విప్లవాన్ని స్టార్ట్ చేయబోతోంది. ఇదే గనక సక్సెస్ అయితే మాత్రం మన ఇండియాలో చాలామందికి ఉపాధి కరువవుతుందని చెప్పవచ్చు. ఇంతకీ చైనా వాళ్లు కనిపెట్టబోయేది ఏంటి.. ఆ వివరాలు చూద్దాం.. ఇప్పటికే మనం రోబో సినిమా చూసాం. ఇందులో రజినీకాంత్ రోబోను తయారు చేసి దాని ద్వారా అన్ని పనులు చేయించుకుంటారు

. ఆ విధంగానే మన ఫ్యూచర్ లో కూడా రోబోలు అన్ని పనులు చేయడానికి రాబోతున్నాయి. ఒక మనిషి ఎన్ని రకాల పనులు చేయగలడో అంతకంటే ఎక్కువ పనులు రోబోలు చేయగలవు. ఇంటి పనుల నుంచి మొదలు వంట పనుల వరకు రోబో చేస్తుందట. దీని ద్వారా పనుల్లో కూడా ఆలస్యం ఉండదు.వెంటవెంటనే చేస్తూ మనకు ఇబ్బంది లేకుండా చేస్తాయట. ముఖ్యంగా మనకు టీ కావాలనిపిస్తే రోబోకు చిన్న మెసేజ్ ఇస్తే చాలు, అది వెళ్లి వెంటనే టీ పెట్టుకొస్తుందట. ఒకవేళ ఇంట్లో పాలు, పంచదార లేకుంటే, వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ కూడా పెట్టేస్తుందట లేదంటే మార్కెట్ కు వెళ్లి తీసుకువస్తుందట. ఈ విధంగా మనిషి ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగానే రోబో అన్ని పనులు చేస్తుందని తెలుస్తోంది.

అయితే దీనిపై చైనా అన్ని రకాల కసరత్తులు చేస్తోందట. అయితే ఇందులో ఫ్యాక్టరీలో పని చేసే రోబోలు అయితే 20 లక్షల వరకు ధర ఉంటుందని, ఇంట్లో పని చేసే రోబోలైతే రెండు లక్షల నుంచి లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఇదే సక్సెస్ అయితే మాత్రం చాలావరకు చిన్నాచితకా పనులు చేసి ఇళ్లలో పనిచేసే బతికే వారికి ఉపాధి కరువు అవుతుందని చెప్పవచ్చు. మరి రోబోల వల్ల మనకు ఎంత లాభం ఉంటుందో, నష్టం కూడా ఆ విధంగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా ఫ్యూచర్ లో మనిషి ఏ పని చేయకుండానే యంత్రాల ద్వారా అన్ని పనులు చేయించే రోజులు రాబోతున్నాయని  నిపుణులు అంటున్నారు. మరి చూడాలి ఈ రోబోలు మన ఇండియాలోకి ఎప్పుడు పూర్తిస్థాయిలో వస్తాయనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: