రక్తపోటునే సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారు అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండానే సైలెంట్ గా ప్రాణాలు తీస్తుంది. ఈ రక్తపోటు దినోత్సవాన్ని 2006లో మే 17వ తేదీన రక్తపోటు దినోత్సవంగా జరుపుకోవాలని అని కేంద్రం ఆదేశించింది.. ఇక ప్రతి ఏడాది ఈ రక్తపోటు దినోత్సవంగా ఒక థీమ్ ను తప్పనిసరిగా పాటించమని కూడా ప్రజలకు సూచించింది. గతేడాది " ప్రతి ఒక్కరు తమ బీపీ లెవల్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి". ప్రజలందరికీ హైపర్టెన్షన్ పై సరైన అవగాహన కల్పించడం కోసం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2021 సంవత్సరపు రక్తపోటు దినోత్సవ థీమ్ ను జరప లేకపోతున్నారు. ఎందుకంటే దీనిని ఒక కార్యక్రమం లాగ ఏర్పాటు చేసి, ప్రజలకు రక్త పోటు పై అవగాహన కల్పించడం వంటివి చేసేవాళ్ళు . కానీ ఈసారి కరోనా మహమ్మారి కారణంగా భౌతిక దూరం పాటించడం వీలుకాని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కేవలం పోస్టర్లు ,చిత్రాలు వంటివి మాత్రమే విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ల ద్వారా విడుదల చేసిన సందేశం ఏమిటంటే.."మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి. దీనిని నియంత్రిస్తూనే, ఎక్కువ కాలం జీవించండి".


ముందుగా రక్తపోటు అంటే ఏమిటో తెలుసుకుందాం..
మన గుండె పని చేయాలి కానీ ప్రయాసపడుతూ పని చేయకూడదు. ఈ రక్తపోటు అనేది గుండె ఎంత కష్టపడి పని చేస్తోందో అనేదాన్ని సూచిస్తుంది. మన రక్త నాళాల్లో రక్తం వేగంగా పరుగులు తీస్తూ, అలల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహిస్తున్నప్పుడు రక్తం రక్తనాళాల గోడల మీద ఒత్తిడి పెడుతుంది. గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళ్తున్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక చివరికి సిరలలో ప్రవేశించి, అక్కడ పూర్తిగా తన వేగాన్ని తగ్గించుకొని, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళీ గుండె కు చేరుకుంటుంది. అయితే రక్తం ప్రవహించేటప్పుడు శరీరం అంతటా ఒకటే వేగం ఉండాలి. ఇలా హెచ్చుతగ్గులు కలిగినప్పుడు శరీరం అంతటా ఒకటే పోటు ఉండదు. కాబట్టి దీనిని వైద్యులు రక్తపోటు అంటారు..

ఈ రక్త పోటు ఉన్నప్పుడు ధమనులలో ఉన్న ఒత్తిడిని కొలుస్తారు.. ఈ ఒత్తిడిని పీడనం అని కూడా అంటారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపోటు 120/80 ఉంటుంది. ఈ విలువ 135/85 దాటితే, ఆ వ్యక్తి అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని అర్థం. అయితే ప్రపంచవ్యాప్తంగా అకాలమరణానికి అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది. దీనికి స్పష్టమైన ఎలాంటి లక్షణాలు లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. సాధారణంగా ఎక్కువ ఉప్పు తినడం, అధిక బరువును కలిగి ఉండడం , తగినంత వ్యాయామం చేయకపోవడం, ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల కూడా రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ..


ముఖ్యంగా రక్తపోటు లక్షణాలు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రజలందరూ రక్తపోటును ఎప్పటికప్పుడు డాక్టర్ వద్ద చెకప్ చేయించుకోవడం ఉత్తమం. ఇంకా అధిక రక్తపోటుకు సంబంధించిన ముందస్తు నివారణ పద్ధతులు తెలుసుకోవడం వల్ల అకాల మరణాల నుండి తప్పించుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: