కొన్నిసార్లు జంతువులు, పక్షుల స్నేహం చూసి ఆశ్చర్యపోతుంటాం. వేర్వేరు రకాల జంతువుల మధ్య పోట్లాటలు, ఆకలి పోరాటాలు చూస్తుంటాం. తమకంటే చిన్న జీవి కనిపిస్తే పెద్ద జీవికి బలి అవ్వాల్సిందే. అలాంటి జంతువులను చాలానే చూసుంటాం. అయితే విభిన్న జాతులకు చెందిన ఈ జంతువులు కలిసి స్నేహం చేస్తే అందరికీ ఆశ్చర్యం కలగక ఉండదు. మనం చూసినట్లైతే పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒ‍క్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధించి వార్త ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.


మొసలి నీళ్లల్లో ఉండే క్రూరజంతువుగా మనకు తెలుసు. బలిష్టమైన గజరాజును కూడా మొసలి ఓడించి మట్టికరిపిస్తుంది. అలాంటి క్రూర జంతువు ఈ చిన్ని బాతుతో స్నేహం చేస్తోందంటే ఆశ్చర్యంగా కలగక మానదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హాయిగా పిల్లలతో పాటు గూటిలో దాగివున్న బాతు దగ్గరికి వచ్చిందో మొసలి. చూస్తుంటే వాటిని ఒక్కగుటకలో మింగేస్తుందేమో అనిపిస్తోంది.



కానీ, మొసలి అలా చేయలేదు. బాతు గూటికి దగ్గరకు బరబరా వచ్చిన మర్కటం ఏకంగా బాతు గూటిలోనే దూరింది. బాతు, దాని పిల్లలకు ఎటువంటి హానీ చేయకుండా అక్కడే హాయిగా నిద్రపోతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వీరి స్నేహం ఎంతో గొప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు.



ఆ వీడియోపై కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. మొసలి ఇలా బాతుతో స్నేహం చేయడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శత్రువులు కూడా ఇలా ఉంటే ఎన్నో అనర్థాలు కలగకుండా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: