కుక్కలకు యజమాని పై విశ్వాసం ఉంటుందన్న విషయం తెలిసిందే..ఆ మాటలు నిజం చేస్తూ కుక్కలు కూడా ఎప్పటికప్పుడు తమ యజమాని పట్ల విశ్వాసాన్ని చూపుతూనే ఉంటాయి. యజమాని కనపడితే చాలు తోక ఊపుతూ తెగ సంబరపడిపోయే నిస్వార్థ మూగజీవాలు శునకాలు.అందుకే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అంటే కుక్కలు అని వేరేలా చెప్పనక్కర్లేదు..మనిషికి బెస్ట్ ఫ్రెండ్ శునకమే అంటారు. పెంపుడు కుక్కలు తమ యజమానిపట్ల ఎంతటి, విశ్వాసం, ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయో మరోసారి రుజువైంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని కోసం చేస్తున్న పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది.


కుక్క తన యజమానికి అందిస్తున్న సహాయానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక ప్రత్యేక స్ఫూర్తి గల వ్యక్తి తన పెంపుడు సాయంతో నగరం చుట్టూ తిరుగుతున్న ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రత్యేక స్ఫూర్తి గల వ్యక్తి వీల్‌ఛైర్‌లో తిరుగుతున్నాడు. అయితే ఇలా తిరగాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. కానీ ఇక్కడ మరే వ్యక్తి ఈ దివ్యాంగుడికి సహాయం చేయలేదు. కాబట్టి, ఈ వీల్ చైర్ ఆటోమేటెడ్, ఎలక్ట్రిక్, మోటరైజ్డ్ కాదు. అయితే ఈ ప్రత్యేక స్ఫూర్తిగల వ్యక్తికి ఓ పెంపుడు కుక్క సాయం చేస్తోంది. తన యజమాని ఆజ్ఞకు విధేయత చూపుతూ, ఈ కుక్క అతడు ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా అతనికి తోడుగా నిలుస్తుంది.


నగరం మొత్తం నగరానికి సహాయం చేస్తోంది. యజమాని తన వీల్‌ఛైర్‌ను నెట్టుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ కుక్క ప్రత్యేకంగా శిక్షణ పొందింది. దివ్యాంగుడైన తన యజమాని వీల్‌చైర్‌పై కూర్చుని ఉంటే..ఆ కుక్క ఆ వీల్‌చైర్‌ని తోస్తుంది. సిగ్నల్ దగ్గర, ఎదురుగా ఏదైనా వాహనం ఎదురైతే యజమాని ఆదేశం ప్రకారం సైకిల్‌ని నెట్టడం ఆపేస్తుంది. యజమాని ఆదేశాన్ని స్వీకరించిన తర్వాత అది మళ్లీ నెట్టివేస్తుంది. ఈ వీడియోలోనూ ఓ ప్రత్యేక వ్యక్తిని తోస్తున్న ఈ కుక్క.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. అప్పుడు అది యజమాని ముందుకి వచ్చి తదుపరి ఆదేశం కోసం వేచి చూస్తుంది. సిగ్నల్ పడిన వెంటనే..యజమాని వీల్‌చైర్‌ని మళ్లీ నెడుతోంది..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: