ఇటీవల కాలంలో ఎన్నో విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా ఇళ్లల్లోకి వస్తున్న పాములు మనుషులపై దారుణంగా దాడులకు పాల్పడటం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. తద్వారా పాముకాటుకు గురై కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొన్ని ఘటనల్లో ఏకంగా ఇంట్లోకి దూలిన పామును స్నేక్ క్యాచర్ సహాయంతో ఎలాంటి హాని తల పెట్టుకునీ చాకచక్యంగా బయటికి తీయగలుగుతున్నారు కొంతమంది జనాలు. ఇక ఇలా జనావాసాల్లోకి పాములు వచ్చిన సమయంలో ఎవరైనా సరే భయపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఇంటి ముందుకు పాము వచ్చినా కూడా అక్కడున్న వారు భయపడటం కాదు ఏకంగా పాము చేసిన పని చూసి నవ్వుకున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక తమ ఇంటి ముందుకు వచ్చిన పాము ఎవరి పైన దాడి చేస్తుందో అనుకుంటే ఏకంగా చెప్పులు దొంగలించుకుని వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ఇది చూసిన నేటిజన్స్  పాము కూడా దొంగగా మారిపోయింది అంటూ ఎంతోమంది ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముంది అంటే భారీగా పొడవు ఉన్న ఒక పాము ఒక ఇంటి వైపుకు దూసుకు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఎవరిపైన అయినా దాడి చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇంటిముందు ఉన్న చెప్పులలో ఒకదాని ఎత్తుకు వెళ్ళింది ఆ పాము. చెప్పును నోట కరచుకొని పాకుతూ వేగంగా వెళ్ళిపోయింది. ఇక బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: