
ఎందుకంటే ఏకంగా స్పేస్ షిప్ లు కొన్ని కొన్ని సార్లు ఆకాశంలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక మెరుపు వేగంతో ఆకాశంలో కదిలే కొన్ని స్పేస్ షిప్లను చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకవేళ కెమెరాలో రికార్డ్ అయి ఉండక పోయి ఉంటే మాత్రం దీనిని ఎవరు నమ్మేవారు కాదు అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఆకాశంలో తోకచుక్కలు చూస్తూ చూస్తుండగానే ఒక మెరుపు మెరిసి కనుమరుగైపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా తెరమీదకి వచ్చింది.
ఈ ఘటన కాలిఫోర్నియాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే ఈ వీడియోలో వేగంగా కదులుతున్న ఆకారం చూస్తూ ఉంటే అది తోకచుక్క మాత్రం కాదు అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అయితే అదేంటి అన్నది మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతూ ఉంది. ఓ ఇంటి ఆవరణలో రాత్రివేళ విచిత్రమైన ఆకారం ఆకాశంలో కనిపించింది. అయితే సిసి టీవీ ఫుటేజ్ ని పరిశీలించిన యజమాని ఆ వింత ఆకారం చూసి అవాక్కయ్యాడు. సరిగ్గా 10 : 09 గంటలకు సమయంలో ఆకాశంలో ఒక జీవిని పోలి ఉన్న ఆకారం రెప్పపాటు సమయంలో దూసుకు వెళ్ళింది. కాగా సదరు ఇంటి యజమాని ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇదేదో ఏలియన్ లాగా ఉంది ఏంటి అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.