సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఎలాంటి సంఘటన జరిగినా కూడా క్షణాలలో వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఎన్నో సంఘటనలు కూడా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. తాజాగా బైక్ నడుపుతున్న భర్తను మహిళ చెప్పుతో కొడుతూ ఉన్న దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఆ మహిళను సైతం చాలామంది మహిళలే కాకుండా నెటిజెన్స్ కూడా తిట్టిపోస్తున్నారు.


అసలు విషయంలోకి వెళితే వీడియోలో కనిపిస్తున్న ప్రకారం.. వీడియోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన భర్తను తిడుతూ ఉండగా.. అకస్మాత్తుగా తన చేతిలోకి చెప్పు తీసుకొని బైక్ నడుపుతున్న భర్తను చెడమాడ వాయించేస్తోంది. అలా కొడుతూ ఉన్నా కూడా ఆ భర్త ఏమి ఎరగనట్టుగా ప్రశాంతంగా బైక్ నడుపుతూ వెళ్తున్నారు. అయితే తన బాధను మాత్రం చూపించలేదు..ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది.అయితే ఈ వీడియోలు చూసిన నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతూ ఆ మహిళను తిట్టిపోస్తున్నారు.


అయితే ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి వచ్చినట్లుగా సమాచారం. ఈ వీడియోలో బైక్ వెనక కూర్చున్న మహిళ అకస్మాత్తుగా తన భర్తను చెప్పుతో కొట్టడం ప్రారంభించిన ఆ వ్యక్తి ఏమాత్రం స్పందించకుండా ప్రశాంతంగా బైక్ తోలుతూ బాధ లేకుండా నడుపుతూనే ఉన్నారు. ఈ విషయం తీవ్రస్థాయిలో ప్రజలను ఆందోళనకు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఇలాంటి పనులు మహిళలు చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని కొంతమంది తెలుపుతున్నారు. అసలు వీరిద్దరూ హెల్మెట్ ఏ ధరించుకోలేదని మరి కొంతమంది తిడుతున్నారు. ఈ ఇల్లాలు ఏంటి ఇంత దిగజారిపోయి మరి భర్తని అంత దారుణంగా కొడుతోంది అంటూ..ఇలా పలువురి నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ రావడం  గమనార్హం. ఈ వీడియో కి సంబంధించి అధికారులను నెటిజెన్స్ ట్యాగ్ చేస్తున్నారు. మరి అధికారులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: