
పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం పెట్టే ఖర్చు బట్టే ట్రైన్ లో సదుపాయాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా స్లీపర్ టికెట్ బుక్ చేసున్న వారికి ఒకలా .. ఏసీ టికెట్స్ ప్రయాణికులను ఒకలా సేవలందిస్తూ ఉంటారు. రైల్వేలలో మీరు ఏ క్యాటగిరీ టికెట్ బుక్ చేస్తే అదే ప్రకారం మీకు సౌకర్యాలు అందిస్తూ వస్తారు . డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తే మీరు థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణించొచ్చు. అక్కడ మీకు సకల సౌకర్యాలు ఉంటాయి . హ్యాపీగా ఇంట్లో మాదిరే పడుకోవచ్చు . ఈ క్లాస్ లో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది . పైగా మీకంటూ దుప్పటి-దిండు- బెడ్ షీట్ అన్ని కూడా లభిస్తాయి .
తద్వార ప్రయాణం మరింత సౌకర్యం అవుతుంది . అయితే కొంతమంది ఇలా రైల్వే ఇచ్చే సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు . తెలియకుండా దుప్పట్లు- దుండ్లు దొంగలించేసి ఇంటికి తీసుకెళ్ళి పోతున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా విచారిస్తుంది . 2018లో భారతీయ రైల్వే లో దుప్పట్లో దొంగతనం గురించి ఒక నివేదిక వచ్చింది . మరి ముఖ్యంగా రైల్వేల బోగి ల నుంచి 2 లక్షల దుండ్లు 41 వేల బెడ్ షీట్లు 7వేల దుప్పట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు అంటూ తేలింది. ఇటువంటి రకమైన దొంగతనాలను నిరోధించడానికి జరిమానా శిక్ష రెండిటిని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.
రైల్వే ఆస్తి చట్టం 1996వ ప్రకారం ఇలా మొదటిసారి దొంగతనం చేస్తూ పట్టుబడితే ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా. కానీ మీరు ఇదే రకమైన దొంగతనం పదేపదే చేస్తూ ఉంటే మాత్రం ప్రభుత్వం సీరియస్ అవుతుంది దాదాపు 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు భారీగా జరిమాన విధిస్తారు . రైల్వే లకు ప్రతి సంవత్సరం దుప్పట్లు - బెడ్ షీట్లు - దుండ్లు దొంగతనం చేస్తున్న కారణంగా లక్షల్లో నష్టం జరుగుతుంది. ఆ కారణంగానే ప్రభుత్వం ఈ విషయాన్ని మరింత సీరియస్గా తీసుకుంది . ఆశ్చర్యమేంటంటే 2017 - 2018 జరిగిన రైల్వే దొంగతనాల కారణంగా దాదాపు ప్రభుత్వానికి కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తుంది..!