
ఇప్పటికే 80% కార్డులను పరిశీలించిన అధికారులు వీటిలో దాదాపు 30 శాతం అర్హత లేని గుర్తించారు . ఆ 30% కార్డులను రద్దు చేయడానికి కూడా తగిన విధంగా ముందుకు వెళ్తున్నారు . కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన లిస్టు ప్రకారం ఇతర రాష్ట్రాలలో కార్డులు కలిగి ఉండడం ..ఒక కార్డు హోల్డర్ డూప్లికేట్ ఆధార్ కార్డుతో వాళ్ళ స్వగ్రామంలో అదే విధంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట రేషన్ కార్డులు మెయింటైన్ చేస్తూ ఉండడం.. అదేవిధంగా రెండు రేషన్ కార్డులు సృష్టించడం.. ఇలా రకరకాల లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ కార్డులను రీ వెరిఫికేషన్ చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. అనర్హతకు గల కారణాలను పరిశీలించి వెంటనే ఆ కార్డులను రద్దయ్యే విధంగా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది . ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు మండల అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. చాలా వరకు ఆరు నుంచి 12 నెలలు రేషన్ తీసుకోకుండా ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు . కొంతమంది బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్న వారు తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో కూడా రేషన్ సరుకులు తీసుకోకుండా అలాగే ఆ కార్డులను వదిలేసి ఉన్నారు . రేషన్ కార్డుల పరిశీలన చివరి దశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత వెంటనే అనార్హ కార్డ్ హోల్డర్స్ ఎవ్వరైతే కేంద్రం పంపిన లిస్టులో ఉన్నారో .. అలాంటి వారు కార్డు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి పక్కాగా ముందుకు వెళుతుంది..!