చాలామంది ఇళ్లల్లో మగవాళ్ళు చీపురు కట్ట పట్టుకోకూడదు అని చీపుర కట్ట పట్టుకొని ఇల్లు ఊడవకూడదు అని అనుకుంటూ ఉంటారు . కేవలం ఇంటి పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలని మగవారు డబ్బు మాత్రమే సంపాదించాలి అని భావిస్తూ ఉంటారు.  ఆడవాళ్లు అంటే వంటింటి కుందేలులా మగవాళ్ళు అంటే బయటకు తిరిగి డబ్బులు సంపాదించే మహారాజుల ట్రీట్ చేస్తూ ఉంటారు , కానీ అది ముమ్మాటికి తప్పే . కేవలం ఆడవాళ్లు వంటింటికే పరిమితం అవ్వాల్సిన పనిలేదు . నేటి సమాజంలో ఆడవాళ్లు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

మన కల్లారా చూస్తున్నాం . అయితే ఇప్పటికీ అరాకొరా ఇళ్లల్లో మగవాలని హైలెట్ చేస్తూ ఆడవాలని తొక్కేస్తూ చూస్తూ ఉంటారు కొంతమంది జనాలు . మరీ ముఖ్యంగా కొంతమంది అత్తమామలు కోడలిని ఇంటి బానిసలా కొడుకుని మహారాజులు ట్రీట్ చేస్తూ ఉంటారు.  కోడలికి ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా సరే ఆమె ఇంట్లో పనులు మొత్తం చేయాలని.. కొడుకు కాళ్లు కిందకు దించకుండా మంచం మీదే కూర్చొని రాజభోగాలు అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు.

 అలాంటి వాళ్ళు అసలు పొరపాటున కూడా ఇంట్లో మగవాళ్ళు చేత చీపుర పట్టుకొనివ్వరు. అలా పట్టుకుంటే ప్రమాదమని అది భర్త ఆయుషు తగ్గిపోయేలా చేస్తుంది అని కొందరు అనుకుంటుంటే ..మరికొందరు మాత్రం అది ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు . కానీ అలా ఏమీ కాదు ఏ గ్రంథంలోనూ ఏ పురాణాలలోనూ మగవాళ్ళు చీపురు కట్ట పట్టుకోకూడదని చెప్పిందే లేదు.  అంతేకాదు ఏ భర్త అయితే భార్యకి హెల్ప్ చేస్తారో భార్య  అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు సేవలు  చేస్తారో ఆ భర్త చాలా చాలా అదృష్టవంతుడిగా భావిస్తారట.  అంతేకాదు ఆ భర్తకి ఆయుష్షు కూడా పెరుగుతుందట.

హిందూ గ్రంధాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు . అలాంటి చీపుర ను పట్టుకోవడం మంచిది. చీపుర ఎక్కడపడితే అక్కడ ఇళ్లల్లో ఉండకూడదు . ఎప్పుడు కూడా తూర్పు దిక్కున ఉండాలట . అప్పుడే ఇంటికి బాగా కలిసి వస్తుందట.  అంతేకాదు ఇల్లు ఊడవడం కూడా ఎప్పుడంటే అప్పుడు ఉడకకూడదట. ఉదయం పూట సూర్యోదయం కన్నా ముందే ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకోవడం మరింత ఉత్తమంటున్నారు నిపుణులు . అంతేకాదు భార్య చీపురతో చిమ్మాలి భర్త  చేయకూడదు అనే రూల్స్ ఎక్కడా లేవు.  భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటి పనులను సగభాగంగా షేర్ చేసుకొని చక చక పనులు కంప్లీట్ చేసుకోవచ్చు.. అది ఇద్దరి వైవాహిక జీవితానికి కూడా మేలు చేస్తుంది అంటున్నారు పెద్దవాళ్లు..!

నోట్: ఇక్కడ అందించినది కేవలం ఒక సమాచారం మాత్రమే. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: