ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్లు కొన్ని కొన్ని నియమాలు అస్సలు పాటించడం లేదు . అందరూ ఇలా ఉన్నారు అని చెప్పలేము కానీ కొంతమంది మాత్రం టెక్నాలజీ మాయలో.. ఫాస్ట్ కల్చర్ మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోతూ వస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్లు రాత్రి వేళల్లో పవిత్రమైన తాళిబొట్టును తీసేస్తున్నారు . అఫ్కోర్స్ కొంతమంది పగలు పూట కూడా తీసేస్తున్నారు . అంతేకాదు నిండు ముత్తైదువుల కనిపించాల్సిన ఆడవాళ్లు రాత్రి వేళల్లో స్కీన్ కేర్ రొటీన్ అంటూ బొట్టు తీసేసి గాజులు తీసేసి మెడలో తాళిబొట్టు తీసేసి లోషన్లు క్రీమ్లు సీరంస్ రాసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .


అయితే అలా చేయడం మహా మహా తప్పు అంటున్నారు పండితులు . మీరు అందం పెంచుకోవడానికి ఎలాంటి క్రీములైన వాడుకోండి.. అందులో తప్పులేదు .. తప్పు పట్టడం లేదు . కానీ ఆడవాళ్లు ఐదో తనానికి గుర్తుగా పెట్టుకునే బొట్టు.. గాజులు, పూలు, మంగళసూత్రం..మెటెలు తీసేయడం పెద్ద దోషమంటున్నారు . అంతేకాదు కొన్నిసార్లు కొన్ని ఘడియల్లో అలా తీయడం వల్ల భర్త ఆయుషు కూడా తగ్గిపోతుంది అని కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్లు కూడా గతంలో ఇదే విధంగా ఇంట్లోనే కోడళ్ళకి కూతుర్లకి చెబుతూ భయపెట్టేవారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు .



ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత తాళిబొట్టును అస్సలు తీయకూడదు.  మెడలో నుంచి అస్సలు తీయనే తీయకూడదు . మరీ ముఖ్యంగా కాళ్ళకి మెట్టెలు .. మెడలో తాళిబొట్టు .. చేతికి గాజులు..  నుదుట కుంకుమ..  తల్లో పూలు కచ్చితంగా ఉండాలి. పల్లెటూరు లో ఇప్పటికి ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే వస్తున్నారు. కానీ సిటీస్ లో మాత్రం కొంతమంది నైట్ స్కిన్ కేర్ రొటీన్ అంటూ క్రీమ్ రాసుకునేటప్పుడు .. తాళిబొట్టు అడ్డు వస్తుంది అంటూ గాజులు ఉంటే సరిగ్గా రాసుకోలేకపోతున్నామంటూ ముఖం మీద కుంకుమ ఉంటే క్రీమ్ ఎలా రాసుకోవాలి అంటూ రాత్రి వేళల్లో బొట్టు , గాజులు, మెడలో తాళిబొట్టు .. కాళ్ళకి మెట్టెలు తీసేస్తున్నారు . మళ్లీ ఉదయం లేచి ఫ్యాషన్ కోసం అవి పెట్టుకుంటున్నారు . ఇది చాలా చాలా తప్పు అంటూ హెచ్చరిస్తున్నారు కొందరు పండితులు . కొన్ని సమయాలలో అలా తీస్తే యమదూతలు ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటారు అని కూడా పెద్దవాళ్లు హెచ్చరిస్తూ ఉంటారు.  అంతే కాదు ఆ కారణంగానే వీధిలో కుక్కల ఏడుపు సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి అని కుక్కలకి దేవుళ్ళు - దెయ్యాలు రెండిటిని చూసే శక్తి ఉంటుంది అని ఇంట్లోని పెద్దవాళ్లు చెబుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అందుకే ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళ సూత్రాన్ని మెడలో నుంచి తీయకూడదు అని ..అది రాత్రి కాదు పగలు కాదు అని పండితులు చెప్పుకొస్తున్నారు.



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ..కొందరు పండితులు అదే విధంగా సోషల్ మీడియాలో పొందుపరిచిన కొంత సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగినది.  ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులు గుర్తుంచుకోవాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: