కావల్సిన పదార్థాలు: సేమియా: 2 కప్పులు (కొద్దిగా నెయ్యి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు 5 నిముషాలు వేగించుకోవాలి) పచ్చి మిరపకాయలు: 3 లేదా 4 మద్యకు కట్ చేసినవి. అల్లం చిన్న ముక్క: తురుము కోవాలి పచ్చిమామిడికాయ తురుము: 3 లేదా 4 కప్పులు (పైపొట్టు తొలగించాలి జీడిపప్పు:10 లేదా 12(ముక్కలుగా కట్ చేసుకోవాలి) నూనె: సరిపడా నెయ్యి: 1 టేబుల్ స్పూన్ ఉప్పు: రుచికి సరిపడా పోపు కోసం ఆవాలు: 1 టీ స్పూన్ ఉద్దిపప్పు: 1/2 టేబుల్ స్పూన్   దాల్చినచెక్క :చిన్న ముక్క కరివేపాకు: రెండు రెమ్మలు తయారు చేయు విధానం: ముందుగా రెండుకప్పుల సేమియాకు రెండు కప్పుల నీళ్ళు పోసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. ఎక్కువగా మెత్తగా ఉడికించకూడదు . నీరు ఏమైనా అధికంగా ఉంటే వాటిని వంపేసి సేమియాను పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె మరియు నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, ఉద్దిపప్పు, చెక్క, జీడిపప్పు, కరివేపాకు వేసి లైట్ గా 1 నిముషం వేగించాలి.  ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి మరియు అల్లం తురుము కూడా వేసి అర నిముషం వేగించుకోవాలి .   తర్వాత అందులోనే పచ్చిమామిడికాయ తురుము కూడా వేసి, మంట మీడియంలో పెట్టుకొని 3-4నిముషాలు వేగించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి(ముందుగా సేమియా ఉడికించేటప్పుడు ఉప్పు వేసిన విషయాన్ని గుర్తించుకోండి. తగినంత మాత్రమే వేసుకోండి)  ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న సేమియాను వేసి పోపు, మ్యాంగో మిశ్రమం, సేమియా అంతా కలగలిసేలా బాగా కలుపుకోవాలి . బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పును సరిచూసుకోవాలి. అంతే మ్యాంగో సేమియా రెడీ. వేడి వేడిగా చట్నీ లేదా మీకు నచ్చిన ఊరగాయతో వడ్డించండి చాలా టేస్ట్ గా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: