గుండెకాయ ఫ్రై.. అబ్బా అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఎంతో రుచిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎవరు చేసేవారు లేకపోయే. అది ఎలా చెయ్యాలో తెలియదు. అలాంటివారు ఈ ఇది చదివి ఎలా చెయ్యాలో తెలుసుకోండి. రుచికరమైన గుండెకాయ ఫ్రై తయారు చేసుకోండి.  


కావలసిన పదార్ధాలు.. 


చికెన్‌ కార్జం అరకిలో, 


పెద్దవుల్లి గడ్డలు రెండు, 



మసాలా పౌడర్‌ ఒక స్పూన్‌, 


అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్‌, 


కరివేపాకు, 


కొత్తిమీర తగినంత, 


కారం ఒక స్పూన్‌, 


ఉప్పు ఒక స్పూన్‌, 


నూనె ఒక గరిటె.


తయారీ విధానం.. 


చికెన్‌ గుండె ముక్కలు నీళ్లు పోసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.   పాన్ లో నూనె కాగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగి వేసి కొంచెం సేపు వేయించాలి. తరువాత గుండె ముక్కలు వేసి బాగా గట్టిపడే వరకూ వేయించాలి. ఉప్పూ కారం పసుపు ముక్కలు వేయగానే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్‌ తరువాత వేసి బాగా వేగనివ్వాలి. దించబోయే ముందు కారం వేసి కొత్తిమీర పైన చల్లాలి. అంతే ఎంతో రుచికరమైన గుండెకాయ ఫ్రై రెడీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: