అరటి పండు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లు ఏ సీజన్లోనైనా విరివిగా లభిస్తాయి. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా కాలేయాన్ని శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే కెరొటినాయిడ్స్ లివర్‌ను కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంద‌ని పేర్కొంటున్నారు. గర్భిణీ స్త్రీలను ఎక్కువగా పండ్లు తినమని డాక్టర్లు, ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. 


అలాగే చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్లు అరటి పండు తినమని ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే అలా అరటి పండు తింటే మగపిల్లాడు పుడతారని వారి న‌మ్ముతారు. అయితే అరటిపండు తింటేనే అబ్బాయి పుడుతాడా? ఇవ‌న్నీ మూడ న‌మ్మ‌కాలు అంటూ కొంద‌రు కొట్టి పారేస్తారు. కానీ.. ఇది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. అరటిపండులో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయి. 


ఇలా మారడం అనేది అబ్బాయి పుట్టడానికి దోహదం అవుతుందన్న విషయం పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే కేవలం అరటిపండు తినడం వలనే కచ్చితంగా అబ్బాయే పుడతాడా? అన్న విషయాన్ని మాత్రం వీరు నిర్ధారించలేకపోతున్నారు. ఏదేమైన అర‌టి వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి.  రోజూ ఒక అరటి పండును తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. అరటి పండ్లలో ఉండే మెగ్నిషియం కండరాలు దృఢంగా మారేందుకు ఉపయోగపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: