జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలక వ్యక్తి ఆయన తల్లి శాలిని. ఆమె నుంచి ఎన్టీఆర్ కి లభించిన ప్రోత్సాహం గాని ఎన్టీఆర్ కి ఆమె నుంచి లభించిన కొన్ని కొన్ని అంశాలు గాని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్న వయసు లో తండ్రికి చాలా దూరంగా ఉండే వాడు ఎన్టీఆర్. తండ్రి ఎక్కువగా హరికృష్ణ వద్ద ఉండటం తో ఎన్టీఆర్ కి తండ్రి తో చిన్న వయసు లో ఎక్కువగా అనుబంధం ఉండేది కాదట. తన ఆలోచనలను పంచుకోవడానికి గానూ ఎక్కువగా తల్లి ప్రోత్సాహం అవసరం అయ్యేది అని, తనకు ఏదో చెయ్యాలి అనే తపన ఉన్నా సరే కొన్ని కారణాలతో... 

 

ఆయన వాటిని పొందలేదు అని కానీ ఎన్టీఆర్ ని సినిమాల్లోకి తీసుకుని రావడం ద్వారా ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించడం ఎన్టీఆర్ భయపడుతున్న సమయంలో అతనికి ప్రోత్సాహం అందించడం వంటివి చేసారట. తండ్రి తో మాట్లాడాలి అంటే ఎన్టీఆర్ భయపడిన సందర్భాలు ఉండేవి అని ఆ సమయంలో ఎన్టీఆర్ కి తల్లి నుంచి చాలా మంచి ప్రోత్సాహం అందింది అని చెప్తారు. నందమూరి కుటుంబానికి తల్లి తో పాటుగా ఎన్టీఆర్ కూడా ముందు దూరంగానే ఉండే వాడు. ఆ తర్వాత కుటుంబానికి ఎన్టీఆర్ ని దగ్గర చేయడానికి గానూ ఆమె చాలా వరకు కష్టపడ్డారని అంటారు. 

 

కుటుంబం లో ఉన్న విభేదాలు తన కొడుకు మీద పడకూడదు అని ఎన్టీఆర్ కి ఆమె అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే వారు అని హరికృష్ణ తో మాట్లాడి గొడవలను పరిష్కరించారు అని అంటారు. అందుకే ఎన్టీఆర్ నేడు ఈ స్థాయిలో ఉన్నాడు అని అంటారు సినీ పండితులు. తగిన విధంగా తల్లి నుంచి అతనికి ప్రోత్సాహ౦ అందింది కాబట్టే కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టలేకపోయింది అని చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: