స్త్రీలు గాజులు ధరించడం అనేది మన సంప్రదాయం. ఇది తరతరాల నుండి వస్తున్నా ఆనవాయితీ. ఏ పని చేస్తున్న చేతి మణికట్టు భాగం నిరంతరం  కదులుతూనే ఉంటుంది. అందుకనే పల్స్ చెక్ చేయడానికి కూడా మణికట్టు భాగాన్నే పట్టుకుంటారు. స్త్రీ లు ధరించే  గాజులు కూడా సరిగ్గా అదే స్థానం లో ఉంటాయి. ఆ గాజుల రాపిడి  రక్త ప్రసరణ పెరిగేలా చేస్తాయి.  ఇవి రౌండ్ గా  ఉండడం వలన  లోపల ఉన్న శక్తి బయటకు రాకుండా, చర్మం నుంచి బయటకు వెల్లుతున్న విద్యుత్ తిరగి శరీరంలోకివెళ్లేందుకు  గాజులు ఉపయోగ పడతాయట. అయితే గర్భిణీ స్త్రీలు గాజులు వేసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు రకరకాల పరిశోధనలు చేశారు. ఆ విషయాలు గురించి తెలుసుకుందామా.

అయితే కడుపుతో ఉన్నవారికి గాజులు  బహుమతిగా ఇస్తుంటారు. దానికి గల కారణం గాజుల  గలగలలు  కడుపులోని బిడ్డకు  ఉద్దీపనలను అందిస్తాయట. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు మంచి సంగీతం లాగా అనిపిస్తుందిట. బిడ్డ లో  వినికిడి సామర్థ్యాన్నిపెంచడంతో  పాటు, గర్భిని స్త్రీ కి  ఒత్తిడి, నిరాశ కలుగకుండా చేస్తాయట. గాజులు వేసుకునే స్త్రీల మీద చేసిన పరిశోధనల ప్రకారం.. సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన గాజులు ధరించిన స్త్రీలలో భావోద్వేగాలు తక్కువగా కనిపించగా, మట్టిగాజులు, గ్లాస్ తో తయారు చేసిన గాజులు వేసుకున్న వారు  మంచి చురుకైన భావోద్వేగాలతో కనిపించారట.

ఇక వాతావరణం నుంచి మంచి, స్వచ్ఛత ను గ్లాస్ తో  తయారు చేసిన గాజులు మాత్రమే తీసుకుంటాయట. అందువల్ల మన చుట్టు పక్కల పరిసరాలు మనకు పాజిటివ్ గా అనిపిస్తాయి. చెడు  ప్రకంపలను తిప్పి కొట్టి పాజిటివిటీని నిండేలా చేస్తాయట. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి స్త్రీ మట్టి గాజులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి..గర్భవతి గా ఉన్నవారైతే చేతి గాజులు అస్సలు తీయకుండా నిండుగా ఉండేలా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: