మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రతిభను చాటుకుంటూ, వారి యొక్క ప్రత్యేకతను ప్రజలందరికీ తెలియజేస్తూ, సమాజానికి ఒక రోల్ మోడల్ గా ఆదర్శంగా తయారవుతున్నారు. ముఖ్యంగా మహిళలు తాము వంటగదిలోనే ఉండాలని మూస చట్రం నుంచి బయటకు వచ్చి తమ విద్యను ప్రదర్శించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆడవారు మగవారికి సమానంగా ఉండాలనే సమాజం కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు. ఎంతోమంది మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చరిత్ర మెచ్చిన మహిళలుగా ఎదిగారు.

అలా తనకంటూ చరిత్ర సృష్టించకుంది ఓ మహిళ. లా చదివినా కూడా లారీ డ్రైవర్ గా పనిచేస్తూ యోగిత రఘువంశీ సమాజంలోని ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ చరిత్ర సృష్టిస్తుంది. మహిళలు విమానాలు నడపొచ్చు,  యుద్ధాలు చేయవచ్చు, అంతరిక్షంలోకి వెళ్ళచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లారీ డ్రైవర్ గా పని చేస్తూ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒంటరిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సరకులను చేరవేసే ఈ మహిళ చరిత్ర నిజంగా అద్భుతం. లారీ డ్రైవర్లుగా మగవాళ్ళను చూస్తేనే ఇంత కష్టమైన పనులు ఎలా చేస్తారో అనిపిస్తుంది అలాంటిది యోగితా రఘువంశీ అనే ఓ మహిళ ఈ పనులను సునాయాసంగా చేయడం చాలా గొప్ప విషయం. 

అందుకే ఆమె ఇంటర్నేషనల్ ఉమెన్ డ్రైవర్ అయ్యింది. రాత్రులు రోడ్డు పక్కన లారీ ఆపి తన వెంట తనే చేసుకోవడం, టైర్ పంచర్ అయినా స్టేపిని మార్చుకోవడం,  వందల కిలోమీటర్లు అలసట లేకుండా లారీ నడిపి సరుకులు చేరవేయడం వంటి పనుల్లో యోగిత ఆరితేరి పోయారు. మహారాష్ట్రలోని నందర్భార్ కు చెందిన ఈమె డిగ్రీ చదివిన తర్వాత లా కూడా చదివి ఉత్తీర్ణరాలయ్యింది.  16 ఏళ్ల క్రితం భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది. అయితే ఆ రంగంలో తనకు డబ్బు రాదని  భావించి జీవితంలో స్థిరంగా నిలదొక్కుకోవాలంటే ఇంతకంటే మంచి పనులు చేయాలని భావించింది. అందుకే లారీ డ్రైవింగ్ నేర్చుకొని మహిళ లారీ డ్రైవర్ గా స్థిరపడింది. లారీ డ్రైవర్ వృత్తి చేపట్టిన నాటి కి ఆమెకున్న పిల్లలిద్దరూ చిన్నవాళ్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: