మహిళలు ఆహార పదార్థాల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. వారి శరీరంలోని ముఖ్య భాగాలు ఎంతో సున్నితంగా ఉండడంతో పాటు ఎంతో దృఢమైనవి కూడా అలాంటి భాగాలను వారు ఎంతో జాగ్రత్తగా సరైన పోషకాలతో చూసుకోవాలి లేదంటే వాటి ద్వారా ఎన్నో కష్టాలు, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మహిళలు పోషకాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం గా మారవచ్చు.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వారికి  ఎంతో అవసరం.

పోషకాహారాల్లో ఎన్నో విటమిన్లు ఉండడం వల్ల మహిళల్లో లోపాలను సరి చేస్తూ వారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా కలకాలం హాయిగా ప్రశాంతంగా బతికే విధంగా అవి తోడ్పడతాయి. మహిళలు ముఖ్యంగా పసుపు ఎరుపు రంగులో ఉండే పండ్లు కూరగాయలు వంటివి తినడం వల్ల ఎంతో ఆరోగ్యం గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగులో పండ్లు తింటే వారి జీర్ణశక్తి మరియు స్టామినా ఎంతో మెరుగు పడుతుంది. అలాగే వారీ సున్నితమైన భాగాలకు కూడా ఈ పదార్ధాల వల్ల ఎంతో మంచి జరుగుతుంది. 

పసుపు ఎరుపు రంగులో ఉండే పండ్లు కూరగాయలలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వంటి జబ్బులను అడ్డుకుంటాయి. మహిళలు విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మనకు లభించే కూరగాయలు క్యాలీఫ్లవర్ లో విటమిన్ బి అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓట్స్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి లోపాలు రాకుండా ఉంటాయి. క్యారట్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా కాంతివంతంగా తయారవుతుంది. బీన్స్ తినడం కూడా మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొవ్వు తక్కువగా ఉండే బీన్స్ తినడం వల్ల మహిళల గుండెకు ఎంతో మంచి చేస్తుంది. ప్రతి రోజూ పాలు గుడ్లు వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: