చిన్నపిల్లల జీవితంలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి పిల్లాడు తన తండ్రిని రియల్ హీరోగా భావిస్తారు. తండ్రినే రోల్ మోడల్‌గా తీసుకుని బతకాలని అనుకుంటాయి. అయితే పిల్లల పెంపకం విషయంలో తల్లితో సమానంగా తండ్రి కూడా బాధ్యతలు స్వీకరించాలి. తల్లలు ఒక అమ్మాయికి ఎలా సమాజానికి సంబంధించిన విషయాలు నేర్పిస్తుందో.. తండ్రి కూడా పిల్లల విషయంలో మంచి విషయాలను నేర్పించాలి. అయితే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన అతి ముఖ్యమైన పాఠాలను తెలుసుకుందాం.

బాధ్యత..
ఒక తండ్రిగా మీ కొడుకుకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయమిది. పిల్లలకు చిన్నప్పటి నుంచి బాధ్యతగా ఉండేలా నేర్పించాలి. కష్ట సమయంలో అండగా ఉండేలా.. నమ్మిన వాళ్లని బాధ్యతగా కాపాడుకునేలా అవగాహన పెంచాలి. బాధ్యతగా ఉండేందుకు కొన్ని రకాల సందర్భాలతో ప్రాక్టికల్ చేయించాలి. బాధ్యతంటే కేవలం పని కాదని.. తప్పు చేస్తే నేనే చేశానని అంగీకరించమని తెలియజేయాలి.
 
సక్సెస్‌తోపాటు ఫెయిల్యూర్‌ని కూడా స్వీకరించేలా..
ప్రస్తుత సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు.. తమ పిల్లలను కేవలం విజయం వైపు పరుగెత్తించడం. సక్సెస్ సాధిస్తేనే బతుకు అన్నట్లుగా ప్రవర్తించడం. ఇలా చేస్తే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. విజయం సాధిస్తానా.. లేదా అనే అయోమయంలో ఎలాంటి పనైనా చేయవచ్చు. అందుకే పిల్లలను సక్సెస్‌తోపాటు.. ఫెయిల్యూర్‌ని కూడా పరిచయం చేయండి. అపజయాన్ని ఎదుర్కొన్నప్పుడే విజయాన్ని సాధించగలడని నమ్మండి.

కోపాన్ని కంట్రోల్ చేసుకునేలా..
పురుషులకు కోపం ఎక్కువ. అనవసరంగా పోట్లాడుకోవడం, దూకుడుగా ప్రవర్తించడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అనవసర విషయాల జోలికి వెళ్లి గొడవ పడొద్దని తండ్రే పిల్లలకు నేర్పించాలి. ఎలాంటి విషయాలతో దూరంగా ఉండాలనే విషయాన్ని బోధించాలి. బంధువులు, కుటుంబీకులతో మర్యాదగా నడుకునేలా నేర్పించాలి.

స్త్రీల పట్ల గౌరవం..
మీరు మీ పిల్లలకు అన్ని విషయాలు చెప్పుకోలేరు. అలాంటి విషయాలను మీ చేతల్లోనే తెలియజేసేలా ప్రయత్నించాలి. మీ ఇంట్లో ఆడవాళ్ల పట్ల మీకు ఎంత గౌరవంగా ప్రవర్తి.. పిల్లలు కూడా మిమ్మల్ని చూసి పెరుగుతారు. మహిళలను గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే మహిళలతో ఎలా ఉండాలో పిల్లలకు తెలుస్తది. ఇలాంటి విషయాలను తండ్రులు తమ పిల్లలకు ప్రతి రోజు చెబుతుండాలి. అప్పుడే పిల్లలు ప్రతి విషయం తెలుసుకుని.. వాటిని అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: