హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సన్నీ డియోల్ ఒకరు . ఈయన చాలా కాలం గ్యాప్ తర్వాత గదర్ 2 మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ మం చి విజయం సాధించడం తో సన్నీ డియోల్ క్రేజ్ కూడా అద్భుతమైన స్థాయిలో పెరిగిపోయింది . ఇది ఇలా ఉంటే తాజాగా సన్నీ డియోల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకు లలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతూ అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు కొనసాగింపుగా జాట్ 2 మూవీ ని కూడా రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు.

ఇకపోతే జాట్ మూవీ కి బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు జాట్ మూవీ కి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయినట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా బుక్ మై షో యాప్ లో ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: