భారత్ లో హవా కొనసాగిస్తున్న ఇసుజు ఇండియా ,తన ప్యాసింజర్ వాహనశ్రేణిను ఇంకాస్త అప్డేట్ చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. అందులో భాగంగానే కంపెనీ తన ఎమ్ యు - ఎక్స్ బీ ఎస్ 6 ప్రీమియం ఎస్ యూవీ ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర ఏకంగా రూ.33.23 లక్షల వద్ద ప్రారంభమవుతుంది.Mu-x suv యొక్క ఇంటీరియర్ గమనించినట్లయితే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కు మద్దతుగా 7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులోనే రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.