చాలా మిడిల్ క్లాస్ ప్రజలకి కార్ కొనాలని కల ఉంటుంది కానీ బడ్జెట్ ప్రాబ్లెమ్ వల్ల కార్ కొనలేరు. అయితే రెండు లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉన్న కారు ఒకటి ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాకుజా కరిష్మా తక్కువ బడ్జెట్ లో దొరికే ఎలక్ట్రిక్ కారు. ఈ కారును భారత మార్కెట్లో దొరికే అతి తక్కువ బడ్జెట్ కార్.యాకుజా కరిష్మా అనేది ఒక మినీ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు సగటు బైక్ కంటే తక్కువ ధరలో వస్తుంది. ఇది ఒక 3-సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌లో ఏకంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇక ఈ మినీ ఎలక్ట్రిక్ కారును 6 నుంచి 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ మినీ కారు టాటా నానో, MG కామెట్ EV లకు గట్టి పోటీనిస్తుంది.ఈ కార్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. పైగా ఈ కారులో స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. ఈ కారు ఆధునిక LED హెడ్‌ల్యాంప్‌లతో ఫిక్స్ చేయబడింది. ఈ కారులో LED DRL కూడా ఉంది.


అంతేగాక ఈ యాకూజా కారులో అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఈ కారుకి ఫిక్స్ చేసిన కొత్త తరం అల్లాయ్ వీల్స్ కారుకు మంచి స్టైలిష్ లుక్ ను అందిస్తాయి.యకుజా కరిష్మా బడ్జెట్ ఫ్రెండ్లి ఎలక్ట్రిక్ కారు. ఇది మల్టీ-స్పీడ్ స్మార్ట్ డిజైన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎన్నో అప్డేటెడ్ ఫీచర్లతో రానుంది. వెంటిలేటెడ్ రూఫ్ ఫీచర్ ఈ కారులో అందించారు. ఈ కారులో ముగ్గురు సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే ఈ కారులో టూ-ఎయిర్ బ్లోయర్‌లను కూడా అమర్చారు. ఇంకా అంతేకాకుండా, ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ఉంది.ఇక ఈ యాకూజా ఎలక్ట్రిక్ కారు ధర విషయానికి వస్తే రూ.1,75,000. ఈ కారును మీరు Yakuza EV అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సాధారణ వ్యక్తి రేంజ్‌లో ఉన్న కారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఈజీగా తిరగవచ్చు. ఇక ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 60v45ah. ఈ ఎలక్ట్రిక్ కార్ టైప్-2 ఛార్జర్ కనెక్షన్ అందించింది. కార్ కొనాలని కలలు కనే మిడిల్ క్లాస్ పీపుల్ కి నిజంగా ఈ కార్ బడ్జెట్ ఫ్రెండ్లి కార్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: