ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బుధ‌వారం నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వ‌నున్నారు. 15 వ తేదీన విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనుండ‌టంతో భ‌క్తులు భారీగా త‌ర‌లిరానున్నారు. కొవిడ్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని, చేతుల త‌రుచుగా శానిటైజ్ చేసుకుంటుండాల‌ని, స‌మూహంగా ఉండొద్ద‌ని, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని, అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని దేవ‌స్థానం అధికారులు భ‌క్తులకు సూచిస్తున్నారు. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు భ‌క్తుల‌ను నియంత్రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని, భ‌క్తులు కూడా అర్థం చేసుకొని స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. ఈ మూడునెల‌ల‌పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఎయిమ్స్ వైద్య‌నిపుణులు కూడా హెచ్చ‌రించ‌డంతో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు తెలిపారు. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకొని భ‌క్తులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: