ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణాజిల్లాలలోని కీలకమైన నియోజవర్గం మైలవరం.. అయితే ఇప్పుడు అక్కడ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్కడ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది .ఈ విషయం పైన చంద్రబాబు బుజ్జగించినప్పటికీ ఆయన ప్లేసులో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చే సమయానికి ఇద్దరినీ ఆఫీసుకు పిలిపించి మరి ఇరువురి నేతలను సర్దిచెప్పి ఒకటి చేశారు. దీంతో దేవినేని ఉమా కూడా ఓకే చెప్పినట్టుగా కనిపించారు.


అలా వసంత కృష్ణ ప్రసాద్ తో కలిపి చేయి చేయి కలిపి ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.. దీంతో మైలవరంలో రగడ పూర్తి అయ్యింది అనుకునే లోపు కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అయితే ఎన్నికల ప్రచారం రూపొందుకుంటున్న సమయంలో దేవినేని ఉమా గత రెండు రోజులుగా అక్కడ ఉన్న నేతలకు అందుబాటులో లేకుండా పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ కూడా అందుబాటులో లేదని సమాచారం.. రెండు రోజుల్లో చంద్రబాబు మైలవరం కి పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమా జంప్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

కీలకమైన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమా ఎక్కడికి పోయారు అనే విషయం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే పార్టీ వర్గాల మధ్య చర్చలలో వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఉమా అమెరికాకు వెళ్లిపోయారని వచ్చే నెల వరకు రారనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కొంతమంది తన సొంత పని పైన ఇతర రాష్ట్రానికి వెళ్లారని చెబుతున్నారు. మరో వారంలోకి వస్తారని తెలుపుతున్నారు.. ఈ విషయం విని అక్కడ టిడిపి నేతలు, కార్యకర్తలు షాక్కు గురవుతున్నారు.ఏది ఏమైనా దేవినేని ఉమా మైలవరం ప్రచారంలో భాగంగా అందుబాటులో లేరనే వార్త మాత్రం వాస్తవమని చెప్పవచ్చు. టికెట్ దక్కలేదని తీవ్ర నిరుత్సాహంలో ఉన్న దేవినేని ఉమాను వైసీపీ పార్టీలో చేర్చుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: