జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు.. ఎక్కడ... ఏం చదివాడో వైసీపీ నేతలు, మంత్రులు చెప్పగలరా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య అడుగుతున్నారు. సీఎం జగన్ విద్యార్హతల వివరాలు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్స్ బహిర్గతం చేయగలరా అని వర్ల రామయ్య నిలదీస్తున్నారు. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఆ తరువాత తనకు భారీ ప్యాలెస్ లు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు.


నాడు తండ్రి ముఖ్యమంత్రి కాక ముందు  2లక్షల ఇన్ కం ట్యాక్స్ కట్టిన వ్యక్తి, నేడు భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ ఎలా మారాడని వర్ల రామయ్య సందేహాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకున్న జగన్, ఎక్కడ చదివాడో, ఏం చదివాడో మాత్రం ఎవరికీ, ఎప్పటికీ చెప్పలేని స్థితిలో ఎందుకు ఉన్నాడని వర్ల రామయ్య అడుగుతున్నారు. మరి వర్ల సందేహాలు తీరుస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: